చేపల కోసం వలవేస్తే.. ఏం చిక్కాయో చూడండి
చేపలకోసం వలవేస్తే..చేపలే పడతాయి కానీ.. ఇంకేం పడతాయి? అనుకుంటున్నారా.. అయితే మీరు వలలో కాలేసినట్టే.. ఒక్కోసారి చేపలకు బదులు మీరు ఊహించని జీవులు కూడా పడతాయి. అలాంటి అనునభవమే ఎదురైంది బీహార్‌లోని మత్స్యకారులకు. చేపలకోసం ఏర్పడిన వలలో చిక్కిన వాటిని చూసి దెబ్బకు హడలెత్తిపోయారు.
బీహార్‌లోని బంకా జిల్లా అమర్‌పూర్ బ్లాక్‌లోని డిగ్గి గ్రామంలోని పాన్ ఆనకట్ట వద్ద గ్రామస్తులు చేపలు పట్టడానికి ఆనకట్టలో వల లాంటిది ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం.. వలలో చేపలు ఏమైనా చిక్కాయేమో అని చూసేందుకు వెళ్లాడు ఓ వ్యక్తి. అందులో కొన్ని చిన్న చేపలతో పాటు నాగుపాము బుసలు కొడుతూ కనిపించడంతో దెబ్బకు షాక్ అయ్యాడు. వెంటనే ఇతర గ్రామస్తులకు విషయం చెప్పాడు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. గ్రామస్తులు ఆ పామును చంపకూడదని నిర్ణయించుకున్నారు. అలా చేస్తే పాపం తగులుతుందని భావించారు. అందుకే పామును జాగ్రత్తగా వలనుంచి విడిపించి సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఆనకట్ట వద్ద ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. గ్రామస్తులు చేసిన పనిని వన్యప్రాణి ప్రేమికులతో పాటు.. అటవీ సిబ్బంది అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rain Alert: ఏపీని వదలని వరుణుడు.. ఈనెల 5 నుంచి భారీ వర్షాలు
40 ఏళ్లు దాటాక.. ఇవి తినాలంటున్న నిపుణులు
పండ్ల మీద స్టిక్కర్లు.. వాటిపై నంబర్లు.. దేనికి ??
