పేడతో పిడకలు చేయడం ఎలా ?? యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ.. వీడియో

Updated on: Feb 18, 2022 | 9:53 PM

ఉన్నతమైన ప్రామాణాలు కలిగిన విద్యను అందించడమే యూనివర్శిటీల ప్రధాన లక్ష్యం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీ దీనికి భిన్నంగా వ్యవహరించింది.

ఉన్నతమైన ప్రామాణాలు కలిగిన విద్యను అందించడమే యూనివర్శిటీల ప్రధాన లక్ష్యం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీ దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలి అన్నదానిపై క్యాంపస్‌లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోని బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ఇటీవల ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. యూనివర్శిటీ సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా ఇందులో పాల్గొన్నారు. ఆవు పేడతో పిడకలు ఎలా తయారు చేయాలి అన్నదానిపై విద్యార్థులకు ఆయన శిక్షణ ఇచ్చారు. అలాగే పిడకల వల్ల ఉపయోగాలను వివరిస్తూ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్.. పిడకలు కేవలం వంట కోసమేకాదు.. పూజలు, యజ్ఞ యాగాదులలో వీటికి ఎంతో ప్రాథాన్యత ఉందని వివరించారు. అంతేగాక తమ విద్యార్థులు గ్రామాలకు వెళ్లి ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలన్నదానిపై గ్రామస్తులకు శిక్షణ ఇస్తారని ఆ డీన్‌ తెలిపారు.

Also Watch:

ఈ పక్షి ప్రతిరోజూ అతని ఇంటికి వస్తోంది !! ఎందుకో తెలుసా ?? వీడియో

Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో

కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో

Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో

గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్ !! చూస్తే షాక్‌ అవుతారు !! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us