Betting Bulls: జత ఎద్దులు.. కోటి రూపాయలు.. ఏంటో వాటి స్పెషల్‌..! వీడియో..

|

Aug 14, 2023 | 9:05 AM

సాధారణంగా ఎద్దులు పొలం పనులకు రైతులకు సాయంగా ఉంటాయి. అందుకే పూర్వ కాలంలో ప్రతి రైతు ఇంట ఎద్దులు, ఎద్దుల బండ్లు తప్పనిసరిగా ఉండేవి. పూర్వం వ్యవసాయం వీటిపైనే ఆధారపడి సాగేది. కాలక్రమంలో వచ్చిన మార్పుల కారణంగా వ్యవసాయంలో వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే కేవలం వ్యవసాయం కోసమే కాకుండా ఎద్దులతో పోటీలు కూడా నిర్వహిస్తారు. అలాంటి ఎద్దులను లక్షలు ఖరీదు చేసి కొంటుంటారు.

సాధారణంగా ఎద్దులు పొలం పనులకు రైతులకు సాయంగా ఉంటాయి. అందుకే పూర్వ కాలంలో ప్రతి రైతు ఇంట ఎద్దులు, ఎద్దుల బండ్లు తప్పనిసరిగా ఉండేవి. పూర్వం వ్యవసాయం వీటిపైనే ఆధారపడి సాగేది. కాలక్రమంలో వచ్చిన మార్పుల కారణంగా వ్యవసాయంలో వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే కేవలం వ్యవసాయం కోసమే కాకుండా ఎద్దులతో పోటీలు కూడా నిర్వహిస్తారు. అలాంటి ఎద్దులను లక్షలు ఖరీదు చేసి కొంటుంటారు. తాజాగా సూర్యపేట జిల్లాలో పందెం గిత్తలు ఏకంగా కోటిరూపాయలకు అమ్ముడుపోయాయి. ఎద్దుల అమ్మకాలు కొనుగోళ్లలో ఇదొక అరుదైన సంఘటనగా చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి గిత్తలను పెంచుతుంటారు. అలా ఆయన పెంచుకున్న గిత్తల్లో ఒక జతను కోటి రూపాయలకు అమ్మారు. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన ఓ రైతు ఇటీవలే ఈ గిత్తలను కోటి రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారు. భీముడు, అర్జునుడుగా పిలిచే ఈ రెండు గిత్తలు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 9 నెలల్లో జరిగిన 40కి పైగా పోటీల్లో పాల్గొన్నాయి. వాటిలో 34 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. ఇన్నేళ్లలో ఇంత ధర పలికిన గిత్తల జత లేదని సురేందర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...