ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..
Diwali Gift

ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..

Updated on: Oct 19, 2025 | 10:33 AM

దీపావళికి చాలా కంపెనీలు బోనస్‌లు, బహుమతులు ఇస్తుంటాయి. కొన్ని ‌సం‌స్థలు స్వీట్ బాక్స్‌లతోనే స‌రిపెడితే.. మరి కొన్ని కంపెనీలు అవి కూడా ఇవ్వకుండా.. కేవలం శుభాకాంక్షలతనే సరిపెడుతుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి. నోయిడాలోని ఓ ఐటీ సంస్థ ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సంస్థ తమకు ఇచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్‌ను హైలైట్ చేస్తూ, ఉద్యోగులే స్వయంగా వాటిని వీడియో తీసి.. అప్‌లోడ్‌ చేసిన రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈ కంపెనీలోని పలువురు ఉద్యోగులు ఉదయాన్నే ఆఫీసుకు వస్తారు. అప్పటికే ఆ ఆఫీసు అంతా చక్కగా అలంకరించి కనిపిస్తుంది. వాళ్లు ఆ ఆశ్చర్యంలో ఉండగానే..అక్కడి గిఫ్ట్‌లు సర్‌ప్రైజ్‌ చేసాయి. బ్రాండెడ్ సూట్‌కేస్,స్వీట్‌ బాక్స్, సాంప్రదాయ మట్టి దీపాన్ని ఈ ఏడాది ఆ సంస్థ గిఫ్ట్‌గా అందించింది. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతూ కనపిస్తారు. కొన్ని క్లిప్‌లలో ఉద్యోగులు సూట్‌కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్‌కేస్ ఉంది. అలాగే స్వీట్‌ బాక్స్ లను అన్‌బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్‌ఫ్రైయర్‌లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు. వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్‌ ఇచ్చిన కాజు బర్ఫీ బాక్స్‌ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” అని ఒకరు కామెంట్‌ చేయగా “దీనిని నా మేనేజర్‌కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” అంటూ మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు. తనకు ఆ ఆఫీస్‌లో జాయిన్ కావాలని ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఆ కంపెనీలో ఖాళీలు ఉంటే తనకు చెప్పాలని మరొకరు అడిగారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా గ్రీన్ కార్డు .. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు

రూ.3 కోట్ల బెంజ్ కారు కొన్న రైతు.. ధోతీ కట్టుకొని వచ్చి ..

హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి