అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని! వైరల్ అయిన ఉద్యోగిని వీడియో
బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగిని అమెరికా, భారతదేశంలోని పని విధానాల మధ్య తేడాలను వివరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికాలో సాయంత్రం 5 గంటలకే కార్యాలయాలు ఖాళీ అవుతాయని, భారత్‌లో మాత్రం రాత్రి వరకు పని కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేయగా, నెటిజన్లలో చర్చ మొదలైంది.
బెంగళూరు ఉద్యోగిని ఒకరు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. భారతదేశం, అమెరికాలో పనివేళలను ఆమె పోల్చారు. అమెరికాలో సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయం మొత్తం ఖాళీగా కనిపిస్తుందని, అదే భారతదేశంలో అవసరమైతే రాత్రి 10 గంటల వరకు సాగుతుందని చెప్పుకొచ్చారు. చాలామంది నెటిజన్లు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించారు. భారత్‌లో పని విధానం ఎలా ఉంది, అమెరికాలో తాను వెళ్లినప్పుడు దినచర్య ఎలా ఉందో ఆమె వివరించారు. భారతదేశంలోని ఎన్నో కార్యాలయాల్లో ఆఫీస్ టైమ్ అయిపోయినప్పటికీ ఎక్కువ సమయం పని చేయడం, నిరంతరం ఆఫీస్‌కు అందుబాటులో ఉంటారని తన అనుభవం నేర్పిందని ఆమె తెలిపారు. అమెరికాలో ఆమె ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య కార్యాలయానికి చేరుకుంటారట. సాయంత్రం నాలుగున్నర గంటలకు చూస్తే కార్యాలయంలో తన ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉందనీ సాయంత్రం 5 గంటలకల్లా చాలామంది ఉద్యోగులు తమ పనిని ముగించుకుని వెళ్ళిపోయారనీ దీంతో తాను కూడా కార్యాలయం నుంచి వెళ్లిపోవాలనుకున్నట్లు వీడియోలో తెలిపారు. చాలాకాలం తర్వాత, మొదటిసారి తనకు ఖాళీ సమయం దొరికిందని, దాంతో తాను హైకింగ్‌కు వెళ్లానని చెప్పారు. కానీ భారత్‌లో పని చేస్తున్నప్పుడు మాత్రం తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయినట్లు చెప్పారు. భారత్‌లో ఆఫీస్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై, రాత్రి 10 గంటల వరకు సాగుతుందని అలాంటి షెడ్యూల్ ఉంటే సమయానికి భోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేసారు. అయితే “ఇలా నాకే అనిపిస్తోందా లేక భారతదేశంలోని కార్పొరేట్ వాతావరణం క్రమంగా కఠినంగా మారుతోందా?” అని ఆమె వీడియో క్యాప్షన్‌లో రాశారు. భారతదేశంలో వ్యక్తిగత సమయాన్ని పణంగా పెట్టి మరీ, కంపెనీలలో సమయానికి మించి పనిచేస్తారని ఆమె తెలిపారు. పైగా దీనికి నిబద్దత, ఉత్పాదకతకు సంకేతంగా చూస్తారని ఆందోళన వ్యక్తం చేసారు. మన వద్ద పని ఒత్తిడికి తోడు ఎక్కువ గంటల పని ఉంటుందని, అమెరికాలో ఫలితాల ఆధారిత విధానాన్ని చూసినట్లు అన్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే ఉత్పాదకత ఉంటుందనే మనస్తత్వమే అసలు సమస్యకు కారణమని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించారు. కానీ కొంతమంది ఆమె వ్యాఖ్యలతో విబేధించారు. చాలా ఐటీ కంపెనీలకు అమెరికా నుంచి వర్క్ వస్తుందని, అలాంటి సందర్బాలలో భారతదేశంలో పని చేసే ఉద్యోగికి ఏవైనా సమావేశాలు ఉంటే సాయంత్రం లేదా ఉదయం లాగ్-ఇన్ అవుతారని, రెండు దేశాలను పోల్చవద్దని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
ఉద్యోగమే మీ గుర్తింపు కాదు.. మహిళ వీడియో వైరల్
Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు
అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్
