ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. టెన్షన్ పడ్డ ఫ్యామిలీ..

|

Dec 30, 2024 | 9:23 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, చాలా విచిత్రమైన విషయాలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. తిరిగి డబ్బులు మాత్రమే తీసుకుంటారు.

అయితే బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ బాయ్ ఓ ఉల్లిపాయ కూడా అడిగాడు. దీంతో ఆర్డర్ చేసిన వ్యక్తి షాకయ్యాడు. బెంగళూరుకు చెందిన యశ్వంత్ పటేల్ అనే వ్యక్తి తన రెడ్డిట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. డెలివరీ బాయ్ తీరుతో తాను, తన భార్య ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నామని యశ్వంత్ తెలిపారు. ఆన్‌లైన్‌లో వస్తువులను బుక్ చేసిన తర్వాత ఇన్‌స్టామార్ట్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడని, సరుకులను డెలివరీ చేసిన తర్వాత “ఉల్లిపాయ ఉందా“ అని అడిగాడని యశ్వంత్ తెలిపారు. అది విన్న యశ్వంత్ దంపతులు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారట. డెలివరీ బాయ్ ఉల్లిపాయలు అడిగేసరికి భయపడ్డ యశ్వంత్, అతని భార్య నవ్వుతూనే “బ్రదర్.. మీరు ఏ మాయామంత్రాలు చేయరు కదా“ అని అడిగారట. దానికి ఆ వ్యక్తి.. “కాదు సర్.. తినడానికి నాకు ఉల్లిపాయ కావాలి“ అని బదులిచ్చాడట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టిప్‌ తక్కువ ఇచ్చిందని కస్టమర్‌ను పొడిచేసిన డెలివరీ గాళ్‌

ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయిన రూ.13 వేల జీతగాడు !!

ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..

ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!

గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు