టీ తాగుదాం రమ్మని పిలిచి.. ఉన్నదంతా దోచి..

Updated on: Jan 24, 2025 | 12:10 PM

57 ఏళ్ల సివిల్ కాంట్రాక్టర్‌ను హనీ ట్రాప్ చేసి 5 లక్షలకు పైగా విలువైన నగదు, విలువైన వస్తువులను దోపిడీ చేసింది ఓ యువతి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..బెంగళూరులోని బైదరహళ్లిలో యువతితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను నయన, మోహన్, సంతోష్ అజయ్, జయరాజ్‌లుగా గుర్తించారు.

వీళ్లంతా సివిల్ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “సివిల్ కాంట్రాక్టర్ స్నేహితుడు ఆరు నెలల క్రితం అతనికి నయనను పరిచయం చేశాడు. కాంట్రాక్టర్‌తో సన్నిహితంగా మెలిగిన ఆమె తన కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు అడిగింది. దీంతో సదరు కాంట్రాక్టర్ రూ.14వేలు బదిలీ చేశాడు. నయన కాంట్రాక్టర్‌ను పలు సందర్భాల్లో ఆహ్వానించినప్పటికీ, అతను ఆమె ఇంటికి వెళ్లలేదు. కానీ వాళ్లిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 9న ఆ మహిళ, అంకుల్ టీ తాగుదాం రండి అంటూ సివిల్ కాంట్రాక్టర్‌ను తన ఇంటికి పిలిచింది. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత, ఉన్నట్టుండి నలుగురు పోలీసుల వేషంలో వచ్చారు. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని..అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ దగ్గర ఉన్న రూ.29 వేల నగదు, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను నిందితులు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఏం తెలియనట్లు నయన అమాయకురాలిగా నటించింది. పైగా…తనతో అక్రమ సంబంధం ఉందని పోలీసులకు చెప్తానంటూ బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు..నిందితులను అరెస్ట్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్స్‌పై రాత్రి.. ఎలా ఉంటుందో తెలుసా ??

రోజూ బెల్లం తింటే..కోపం తగ్గిపోతుందట..