ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులకి చెప్పరు !! ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం అమలు
బెంగళూరులోని ప్రొవిడెంట్ సన్‌వర్త్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్, నేరాలను పోలీసులకు నివేదించకుండా, అంతర్గతంగా విచారించి, జరిమానాలు వసూలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలపై నేరాలు, దొంగతనాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి తీవ్ర ఆరోపణలను అసోసియేషన్ కప్పిపుచ్చి, సొంత "సమాంతర న్యాయ వ్యవస్థ" నడుపుతోందని పోలీసులు తెలిపారు. ఈ చర్య NDPS చట్టంతో సహా పలు నిబంధనలను ఉల్లంఘిస్తుందని పోలీసులు స్పష్టం చేశారు.
ఎలాంటి నేరం జరిగినా తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరాలను విచారించే అధికారం వ్యక్తులకు లేదు. అయితే బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్లో మహిళలపై నేరాలు, దొంగతనాలు, డ్రగ్స్ వాడకం వంటి తీవ్ర నేరాలు జరిగినప్పటికీ, వాటిని పోలీసులకు చెప్పకుండా అసోసియేషన్ అడ్డుకుంది. అసోసియేషన్ సొంతంగా కొన్ని నిబంధనలు రూపొందించుకుంది. నేరాలకు పాల్పడిన వారిని అంతర్గతంగా విచారించి, వారి నుంచి జరిమానాలు వసూలు చేసి వదిలేస్తుంది. చట్టపరమైన వ్యవస్థను కాదని, సొంతంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పనుల్లో సెక్యూరిటీ ఏజెన్సీ కూడా సహకరించినట్లు తెలిసింది. లైంగిక దాడులు, దొంగతనాలు, డ్రగ్స్ సంబంధిత కేసుల్లో అసోసియేషన్ , నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గడిచిన కొన్ని నెలల్లోనే, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి రూ. 25,000 వరకు జరిమానాలు వసూలు చేశారట. ఈ ఆరోపణల ఆధారంగా, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌పై చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు NDPS చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు. నేరాలను పోలీసుల దృష్టికి తీసుకురాకుండా, అంతర్గతంగా విచారణలు జరిపి, నిందితుల నుంచి ఫైన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. దొడ్డబెలెలో ఉన్న ప్రొవిడెంట్ సన్‌వర్త్ అపార్ట్‌మెంట్ అసోసియేషన్, టైకో సెక్యూరిటీ ఏజెన్సీపై కుంబళగోడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, విద్యార్థులు ఉంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
12 ఏళ్లకు మించి బతకడన్నారు… కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో…! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
