Bear Viral Video: వివాహ వేదికపైకి అనుకోని అతిథి.. కుటుంబ సమేతంగా ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి వైరల్ అవుతున్న వీడియో
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో వింత సంఘటన జరిగింది. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వేడుకకి ఊహించని అతిథి కుటుంబ సమేతంగా ఎంట్రీ ఇచ్చింది. అయితే కాస్త ఆలస్యంగా రావడంతో పాపం వెనుదిరిగి వెళ్లిపోయింది. కంకేర్ జిల్లాలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో వింత సంఘటన జరిగింది. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వేడుకకి ఊహించని అతిథి కుటుంబ సమేతంగా ఎంట్రీ ఇచ్చింది. అయితే కాస్త ఆలస్యంగా రావడంతో పాపం వెనుదిరిగి వెళ్లిపోయింది. కంకేర్ జిల్లాలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. వేడుక అనంతరం వధువరులతోపాటు, ఆహ్వానితులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో ఒక ఎలుగుబంటి తన పిల్లలను వెంటపెట్టుకొని ఆ ఫంక్షన్ హాల్‌కి వచ్చింది. రిసెప్షన్ వేదిక పైకి వెళ్లింది. అక్కడ వాసన చూసి అటు ఇటు తిరిగింది. కొంత సేపటి తర్వాత అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ సమయంలో ఆ ఫంక్షన్ హాల్ వేదికపై ఎవరూ లేకపోవడంతో ఆ ఎలుగుబంటి వల్ల ఎవరికీ ఎలాంటి ముప్పు కలగలేదు. అయితే ఆ సమయంలో ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న సిబ్బంది ఎలుగుబంటి రాకను గమనించారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో దీనిని రికార్డు చేశాడు. అది ఎలాంటి విధ్వంసం సృష్టించకుండా వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా పలు కామెంట్లు చేశారు. ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ కూడా వీడియోను షేర్ చేస్తూ.. ‘బహుశా.. విందు ఏర్పాట్లు వాటికి నచ్చలేదు అనుకుంటా’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూస్తున్న నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

