కారు సైడ్ మిర్రర్‌కు డాష్ ఇచ్చాడని.. కక్షతో బైకర్‌ను వెంబడించి మరీ..

Updated on: Nov 01, 2025 | 11:25 AM

చిన్న చిన్న కారణాలకు మనుషుల ప్రాణాలు తీసేంత మూర్ఖంగా తయారవుతున్నారు కొందరు జనాలు. క్షణికావేశంలో విచక్షణ మరచి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అక్టోబర్ 22 అర్ధరాత్రి బెంగళూరులోని శ్రీరామ లేఅవుట్లో దర్శన్ అనే డెలివరీ బాయ్‌ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వీరి పక్కనే ఓ కారు కూడా వెళ్లింది.

అయితే చూసుకోకుండా దర్శన్ బైక్.. ఆ కారు సైడు మిర్రర్‌ను తాకింది. దీంతో కారులో ఉన్న మనోజ్‌కుమార్, అతడి భార్య ఆరతి శర్మ కారు దిగి వచ్చి.. దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. గొడవ సద్దుమణగకపోవడంతో.. దర్శన్ బైక్ మీద వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన దంపతులు.. కారులో దర్శన్ బైక్‌ను రెండు కిలోమీటర్లు వెంబడించారు. ఆ తర్వాత వెనక నుంచి బైక్‌ని ఢీకొట్టి వెళ్లిపోయారు. ప్రమాదంలో దర్శన్, అతని స్నేహితుడు వరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దర్శన్‌ చనిపోయాడు. ప్రస్తుతం వరుణ్‌కి చికిత్స అందిస్తున్నారు. బైక్‌ ఢీకొట్టిన తర్వాత కూడా మనోజ్, ఆరతి దంపతులు మరోసారి ఘటనా స్థలికి వచ్చారు. అక్కడ వారి కారు విడి భాగాలు కొన్ని పడిపోగా.. వాటిని తీసుకెళ్లేందుకు వచ్చారు. అయితే తమను ఎవరైనా గుర్తు పడతారనే ఉద్దేశంతో ముఖానికి మాస్క్ ధరించారు. అయితే అక్కడున్న సీసీటీవీల్లో వీరి కదలికలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితులను గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంత చిన్న కారణానికి హత్య చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశంలో వింత కాంతులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యం

ప్రియుడి పైశాచికత్వం.. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తా

ఈమె పోలీసు ఆఫీసరే కాదు.. ఖతర్నాక్‌ దొంగ కూడా

భార‌తీయుల‌కు అమెరికా మ‌రో బిగ్ షాక్‌

రయ్య్‌మంటూ దూసుకెళ్తున్న డ్రైవర్‌లెస్‌ కారు

Published on: Nov 01, 2025 11:25 AM