వీడు మామూలోడు కాదు.. హెల్మెట్‌కు బదులుగా మూకుడు

Updated on: Nov 09, 2025 | 1:30 PM

బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘిస్తూ ఓ వ్యక్తి చేసిన వింత ప్రయత్నం సంచలనంగా మారింది. అతగాడు..తలపై హెల్మెట్‌కు బదులుగా వంటగదిలో వేపుడు చేసుకునే.. ఓ అల్యూమినియం ఫ్రయింగ్ పాన్‌ను పెట్టుకుని ప్రయాణించాడు. ఇది చూసిన కొందరు ఆయన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా ఈ వ్యక్తి వీడియో పీక్ బెంగళూరు మూమెంట్ గా తెగ ట్రెండ్ అవుతోంది. బైక్ మీద వెళ్లే టైంలో దానిపై ప్రయాణించే వారిద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధలను చెబుతున్నాయి. బెంగళూరు పోలీసులు ఈ రూల్‌ను పాటించని వాహనాలను గుర్తించి.. ఫోటో కొట్టి చలానా వేస్తున్నారు. ఇక.. ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా, వెనక కూర్చొన్న వ్యక్తి నెత్తిపై మూకుడుతో కనిపించాడు. అంతేకాదు.. నెత్తి మీదున్న మూకుడును భలే బ్యాలెన్స్ చేశాడు. దీంతో, ట్రాఫిక్ చలానా తప్పించుకునేందుకు సదరు వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని పలువురు ఫోటోలు,వీడియోలు తీసి పిచ్చపిచ్చగా వైరల్ చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది నవ్వు ఆపుకోలేకపోతున్నారు. భలే ఐడియా అని కొందరు, చలానా తప్పించుకోవడానికి ఇంతకంటే గొప్ప ఉపాయం ఉండదు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియో.. రోడ్డు భద్రతా నిబంధనల విషయంలో ప్రజల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టింది. మూకుడులో ఎలాంటి వంటకాలు అయినా చేసుకోవచ్చు కానీ, తలకు తగిలే దెబ్బ నుంచి ప్రాణాన్ని కాపాడలేదని అంటున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రూపేన అగ్రహారలో జరిగిన ఘటనపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌ అయ్యారు. ప్రాణాలకు విలువ లేకుండా పోతోందని.. వారి క్షేమం కోసమే హెల్మెట్ వాడాలని చెబుతుంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ సెలబ్రెటీలు కావాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర తీరంలో వింత జీవులు..

Health: శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే

స్కూలుకి వెళ్లనని చిన్నారి మారాం.. పేరెంట్స్‌ ఏం చేశారో చూడండి

Published on: Nov 09, 2025 01:28 PM