ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ

Updated on: Nov 11, 2025 | 4:17 PM

ప్రేమను నిరాకరించిన ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ యువతి ఖతర్నాక్ ప్లాన్ వేసింది. అతడి పేరుతో బెంగళూరు, గుజరాత్‌లోని స్కూళ్లు, కాలేజీలు, స్టేడియాల్లో బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు పంపింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి, ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ప్రేమ తిరస్కరణకు యువతి చేసిన నేరపూరిత చర్యను వెల్లడిస్తుంది.

ప్రేమను నిరాకరించారని అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్‌ దాడులు చేయడం, హత్యలకు పాల్పడటంలాంటి ఘనలు మనం చూసాం. కానీ ఓ యువతి తన ప్రేమను కాదన్నాడని ఆమె ప్రియుడిపై కక్ష పెంచుకుంది. అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలనుకుంది. అందుకు ఓ ఖతర్నాక్‌ ప్లాన్‌ వేసింది. పలు స్కూళ్లు, కాలేజీలు, క్రికెట్‌ స్టేడియాల్లో బాంబులు పెట్టినట్టు అతడి పేరిట తయారుచేసిన ఈ మెయిల్ నుంచి పోలీసులకు బెదిరింపు సందేశాలు పంపింది. ఆనక అసలు విషయం బయటపడటంతో చివరికి కటకటాలపాలైంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. రెని జోలిల్డా అనే యువతి బీఈ-ఎలక్ట్రానిక్‌ విద్య పూర్తి చేసింది. ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అక్కడ ఓ వ్యక్తిని ప్రేమించింది. అతను నిరాకరించడంతో తట్టుకోలేకపోయింది. అతనిపై ప్రతీకారం పెంచుకుంది. ఎలాగైనా అతడిని దెబ్బతీయాలనుకుంది. వెంటనే ఆ యువకుడి పేరిట ఇంటర్నెట్‌లో అకౌంట్లు ఓపెన్‌ చేసి, పాఠశాలలు, కళాశాలల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు, హెచ్చరికల సందేశాలు పంపించింది. గుజరాత్‌ కేంద్రంగా బెదిరింపులకు పాల్పడింది. అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ క్రికెట్‌ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరిస్తూ గతంలో ఓసారి మెసేజ్‌లు పంపింది. ఈ కేసులో అహ్మదాబాద్‌ పోలీసులు ఇప్పటికే ఆమెను అరెస్టు చేశారు. కాగా, బెంగళూరు కేసులకు సంబంధించి విచారించడానికి ఆమెను బాడీవారెంట్‌పై గురువారం బెంగళూరుకు తీసుకువచ్చారు. ఆమె గుజరాత్‌ నుంచే బెంగళూరులోని స్కూళ్లు, కాలేజీలకు ఈమెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు లకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రియుడి పేరిట బెదిరిస్తే.. అతడిని అరెస్టు చేస్తారని భావించింది. అలా జూన్‌ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. ఆ కేసు విచారణ ఉత్తర విభాగం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేపట్టారు. ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె ప్రాథమిక విచారణలో అంగీకరించిందని కమిషనర్‌ వివరించారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Elon Musk: చరిత్ర సృష్టించబోతున్న ఎలన్‌ మస్క్‌

Vizag: వెబ్‌సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు

చిరంజీవి రికార్డును బీట్ చేసిన చరణ్.. మొత్తానికి ఊపుమీదున్న తండ్రీకొడుకులు

Reliance Jio: జియో కీలక నిర్ణయం.. జెమినీ AI ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

Rapido Fake App: ఫేక్‌ ర్యాపిడో యాప్‌తో క్యాబ్‌ డ్రైవర్‌ మోసం