Viral Video: బ్యాండ్.. బాజా.. బందూక్.. పెళ్ళి వేడుకలో గాల్లోకి కాల్పులు..! కట్ చేస్తే పెళ్లి కూతురు..
పెళ్ళిలో తుపాకీతో గాల్లో కాల్పులు జరుపుతూ వేడుక చేసుకోవడం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అనుమతి లేని తుపాకీలతో అతిథుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారికి ఈ మధ్యకాలంలో పోలీసులు గట్టి వార్నింగే ఇస్తున్నారు.
పెళ్ళిలో తుపాకీతో గాల్లో కాల్పులు జరుపుతూ వేడుక చేసుకోవడం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అనుమతి లేని తుపాకీలతో అతిథుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారికి ఈ మధ్యకాలంలో పోలీసులు గట్టి వార్నింగే ఇస్తున్నారు. అయినా సంఘటనలు ఒకటీ అరా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని చత్తార్పూర్‌లో జరిగిన ఓ పెళ్ళి వేడుకలో సెలబ్రేటరీ ఫైరింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.సెలబ్రేటరీ ఫైరింగ్‌లో 54 ఏళ్ళ మహిళ గాయపడిందని పోలీస్ స్టేషన్‌కు కాల్ రావడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత నిందితులను అశ్వనికుమార్, పీయూష్ గౌతమ్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, కార్‌ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..