చిన్న సాంకేతిక లోపం ఆసరాగా.. రూ. 9.49 లక్షలు దోచేశారు !!

|

Dec 21, 2022 | 8:21 PM

చిన్నపాటి సాంకేతిక లోపాన్ని గమనించి విశాఖలోని బ్యాంకు ఏటీఎంల నుంచి దొంగలు 9.49 లక్షల క్యాష్‌ దోచేశారు. మొత్తం ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

చిన్నపాటి సాంకేతిక లోపాన్ని గమనించి విశాఖలోని బ్యాంకు ఏటీఎంల నుంచి దొంగలు 9.49 లక్షల క్యాష్‌ దోచేశారు. మొత్తం ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. రాజస్థాన్‌ భరార్‌పుర్‌ ప్రాంతానికి చెందిన షారూక్‌ 2017 నుంచి విశాఖలో చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడు గత నెల 30న అదే రాష్ట్రానికి చెందిన రషీద్‌, ముస్తకీమ్‌, సాయికూల్‌తో కలిసి నగరానికి విమానంలో వచ్చి ఓ లాడ్జిలో బస చేశారు. వారు తమ ప్రాంతానికే చెందిన కొందరితో కనకమహాలక్ష్మీ కోఆపరేటివ్‌ బ్యాంకులో ఖాతాలు తెరిపించి డెబిట్‌ కార్డులను తమ వద్దే ఉంచుకున్నారు. వారితో కొంత నగదు అకౌంట్లలో వేయించి.. తర్వాత తమ చోరీ ప్రణాళిక అమలు చేసారు. ముందుగా ఆ బ్యాంకు అనకాపల్లి బ్రాంచి ఏటీఎంలో వారు తమ పథకాన్ని అమలు చేశారు. నగదు విత్‌డ్రాకు కార్డు పెట్టిన తర్వాత డబ్బులు వచ్చే సమయంలో ఏటీఎం యంత్రం పవర్‌ బటన్‌ను ఆపేసి వెంటనే ఆన్‌ చేస్తారు. ఆ సమయంలో ఏటీఎం నుంచి నోట్లు బయటకు వచ్చినా.. అవి క్యాసెట్‌ మధ్యలో ఉండగానే పవర్‌ ఆపేయడం వల్ల లావాదేవీని తప్పుగా చూపుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిర్యానీలో ఈగ.. అదిరిపోయే తీర్పు ఇచ్చిన వినియోగదారుల ఫోరం

సిగరెట్లు కొనకుండా నిషేధం !! న్యూజిలాండ్‌లో కొత్త చట్టం

అమెరికాలో ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్.. బిల్లుపై బైడెన్ సంతకం..

పైలట్లే కూల్చేశారా ?? తాజాగా దొరికిన విమాన తలుపు !!

అమ్మా..నువ్వు దేవతవి అంతే.. ఉద్యోగులకు రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..

 

Published on: Dec 21, 2022 08:21 PM