ఏటీఎం నుంచి రూ. 100 నోట్లకు బదులు రూ. 500 నోట్లు.. ఎగబడ్డ జనం

Updated on: Jun 05, 2025 | 6:00 PM

ఢిల్లీలో ఓ ఏటీఎంలో భారీ మోసం జరిగింది. 100 రూపాయల ట్రేలో 500 రూపాయల నోట్లను పెట్టడంతో ఈ విషయం తెలుసుకున్న జనం ఎగబడ్డారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు పోటీపడ్డారు. ఢిల్లీలోని హర్ష్‌విహార్‌లో జరిగిందీ ఘటన. ఓ వినియోగదారుడు ఏటీఎం నుంచి ఎమౌంట్‌ డ్రా చేశాడు. అయితే, వంద నోట్లకు బదులు అన్నీ రూ. 500 నోట్లే బయటకు వచ్చాయి.

లెక్కించి చూస్తే అధిక మొత్తంలో ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై డబ్బు లోడింగ్‌ చేసే సంస్థ మేనేజర్‌ ఇద్దరు ఉద్యోగులపైనా తీవ్రమైన ఆరోపణలు చేసారు. పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా నోట్లను మార్చి ట్రేలలో ఉంచినట్లు సంస్థ మేనేజర్‌ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీన ఇద్దరు ఉద్యోగులను తాను 31 లక్షల రూపాయలు లోడ్‌ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. రొటీన్‌ ఆడిట్‌ సమయంలో బాగోతం బయటపడిందని అన్నారు. అంతేకాదు 500 రూపాయల ట్రేలో వంద రూపాయల నోట్లను ఉద్దేశపూర్వకంగ ఉంచి ట్రే ను కొద్దిగా బయటకు లాగి ఉంచారని దాంతో వంద రూపాయల నోట్లు మెషీన్‌ నుంచి బయటకు రాకుండా చేసారని తెలిపారు. 112 మంది కార్డు వినియోగదారులకు ఫోన్‌ చేసి ఎమౌంట్‌ విత్ డ్రా చేయాలని ఆ ఇద్దరు ఉద్యోగులు కోరినట్లు తెలిపారు. దాంతో కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు పరుగులు పెట్టారనీ అన్నారు. వంద నోట్లకు బదులుగా రూ. 500 నోట్లు వస్తున్న విషయం తెలుసుకుని పెద్దమొత్తంలో విత్ డ్రా చేశారని దాంతో సంస్థకు రూ. 8 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో.. చేప కొరికితే ఇంత డేంజరా? ఏకంగా చెయ్యే తీసేశారు

వివాహ వేడుకకు విశిష్ట అతిథి.. బంధుమిత్రులంతా పరుగో పరుగు

సర్పంచ్‌ కుర్చీని వదలనంటున్న శునకం.. చూసేందుకు క్యూ కడుతున్న జనం

షాపులో వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన ఓనర్‌కి షాకింగ్‌ సీన్‌

నేర చరిత్ర ఉన్న రిసార్ట్‌లో బస? హ‌నీమూన్ కోసం వెళ్లి.. అడ‌వుల్లో అదృశ్యం