ఒకే అమ్మాయికి 7 ప్రభుత్వ ఉద్యోగాలు.. అయినా..

|

Dec 08, 2023 | 7:31 PM

ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే విలువే వేరు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే జీవితం సెటిల్‌ అయిపోయినట్టే అని భావిస్తారు. అయితే, ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో ఓ అమ్మాయి ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అవును, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి ఈ ఘనతను సాధించింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. సివిల్స్‌ సాధించిన ప్రజా సేవచేయడమే తన లక్ష్యం అంటోంది.

ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే విలువే వేరు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే జీవితం సెటిల్‌ అయిపోయినట్టే అని భావిస్తారు. అయితే, ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో ఓ అమ్మాయి ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అవును, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి ఈ ఘనతను సాధించింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. సివిల్స్‌ సాధించిన ప్రజా సేవచేయడమే తన లక్ష్యం అంటోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. కీర్తీ తండ్రి మురళీ కృష్ణ ఓ న్యాయవాది. 2019లో డిగ్రీ పూర్తి చేసిన కీర్తికి సివిల్స్ సాధించాలన్నది లక్ష్యం. తొలుత 2019లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆదాయ పన్ను విభాగంలో ఉన్నతాధికారి ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత కేంద్ర కస్టమ్స్ డిపార్ట్ మెంట్ లో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సఫారీ సమయంలో కనిపించిన పులి.. తర్వాత ఏం జరిగిందంటే ??

పెళ్లిలో వెయిటర్‌ను కొట్టి చంపిన అతిథులు.. ఏం జరిగిందంటే ??

ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు

రైల్ కోచ్‌ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్‌ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో