పెరట్లో కలుపు మొక్కలున్నాయా ?? జాగ్రత్త !!
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాను వల్ల ఆవాసాలు కోల్పోయిన పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా తిమ్మాపురంలో ఓ ఇంటి పెరట్లో 11 అడుగుల భారీ కొండచిలువ కనిపించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. స్థానిక స్నేక్ క్యాచర్ దానిని బంధించి నల్లమల అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పాములు కూడా ప్రజలను వెంటాడుతున్నాయి. మొంథా తుఫాను కారణంగా భారీవర్షాలు, వరదలతో ఎక్కడెక్కడినుంచో పాములు, కొండచిలువలు కొట్టుకొచ్చాయి. తుఫాను ప్రభావంతో ఆవాసాలు కోల్పోయిన ఈ పాములు జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ఇంటి పెరట్లో భారీ కొండచిలువ ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం తిమ్మాపురంలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన షేక్ షావలి ఇంటి పెరట్లో మొక్కల మధ్యన ఏదో అలజడి రేగడంతో.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూశాడు. అక్కడ మొక్కల మధ్యలో ఓ భారీ కొండచిలువ కనిపించటంతో భయంతో వణికిపోతూ ఇంట్లోకి పరుగెత్తి కుటుంబసభ్యులను అలర్ట్ చేశాడు. విషయం తెలిసి చుట్టుపక్కలవారంతా అక్కడ గుమిగూడారు. వారంతా ఆ కొండచిలువను చూసి స్థానిక స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు. ఇక.. బంధించే సమయంలో దాదాపు 11 అడుగులున్న ఆ కొండ చిలువు.. మోహన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి స్కేక్ క్యాచర్ దానిని అతి కష్టం మీద బంధించి నల్లమల అడవిలో వదిలి పెట్టారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తన అనుభంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది పెట్టిన కొండచిలువను చూడలేదని స్నేక్ స్నాచర్ మోహన్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెల రోజుల పాటు ఉదయాన్నే ఈ నీరు తాగండి.. ఫలితం మీరే చూడండి
వీడు మామూలోడు కాదు.. హెల్మెట్‌కు బదులుగా మూకుడు
Health: శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే
స్కూలుకి వెళ్లనని చిన్నారి మారాం.. పేరెంట్స్ ఏం చేశారో చూడండి
