బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు వీడియో
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగుమతులు కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో జల కళను సంతరించుకుంటున్నాయి. కాక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు చెప్పింది.
బంగాళాఖాతంలో సెప్టెంబర్ 13న ఆల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. శుక్రవారం అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ ఏపీలోని పలు ప్రాంతాల్లో వేడి ఉక్కపోత తీవ్రంగా ఉంది. కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, గన్నవరం, బాపట్ల, కావలి, నెల్లూరు వంటి తీర ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర ఆల్పపీడనం ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
