దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం

Updated on: Feb 28, 2026 | 4:45 PM

ప్రకాశం జిల్లా దీవేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. అయితే, క్షతగాత్రులకు సహాయం చేయకుండా స్థానికులు, వాహనదారులు రోడ్డుపై పడిన చేపల కోసం ఎగబడ్డారు. ప్రాణం పోయినా, మానవత్వం లేకుండా చేపలు దోచుకోవడం సమాజ నైతిక విలువల పతనాన్ని ప్రశ్నిస్తోంది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఒకవైపు ప్రమాదంలో ప్రాణం పోయిందని ఆవేదన.. మరోవైపు ఉచితంగా దొరుకుతున్నాయని చేపల కోసం ఎగబడ్డ జనం. “ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు అడిగినట్లు” ఉంది ఈ ఘటన. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దీవేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదం సమాజంలోని నైతిక విలువలను ప్రశ్నిస్తోంది. కడప జిల్లా చెన్నూరు నుండి కలకత్తా వైపు చేపల లోడుతో వెళ్తున్న మినీ లారీ, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ షౌకత్‌, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లారీ డ్రైవర్‌ షౌకత్ మృతిచెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కాపాడాల్సింది పోయి, స్థానిక గ్రామస్థులు , అటుగా వెళ్తున్న వాహనదారులు చేపల కోసం ఎగబడ్డారు. లారీ బోల్తా పడి చేపలన్నీ రోడ్డున పడటంతో.. జనం పోటీ పడి మరీ చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లారు. కేజీల కొద్దీ చేపలే కాకుండా, ఏకంగా చేపల పెట్టెలను సైతం వదలకుండా పట్టుకెళ్లడం గమనార్హం. ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోతే, కనీసం మానవత్వం లేకుండా చేపల కోసం జనం తండోపతండాలుగా రావడం.. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే

Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..! మామూలుగా లేదుగా..

Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్

Follow Us