బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి తుఫాన్ ముప్పు వీడియో

Updated on: Nov 23, 2025 | 1:35 PM

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు తప్పేలా లేదు. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయవ్య దిశగా పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

శనివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో దాని ప్రభావంతో ఇప్పటికే బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో చలి కాస్త తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక అల్పపీడనం ప్రభావంతో.. తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో