తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం.. అబ్బా అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు..

Updated on: Dec 19, 2025 | 1:41 PM

మంచిర్యాల జిల్లాలోని ముల్కల గ్రామంలో సింహవాహిని దుర్గామాత విగ్రహం బయటపడింది. గోదావరి ప్రదక్షిణ యాత్రలో ఉన్న సాధుసంతుల సూచనతో తవ్వకాలు జరపగా, ఈ విగ్రహం లభ్యమైంది. విజయవాడ దుర్గమ్మ తరహాలోనే తెలంగాణలో ఈ అమ్మవారు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

మంచిర్యాల జిల్లా, హజీపూర్ మండలం ముల్కల గ్రామంలో ఇటీవల దుర్గామాత విగ్రహం వెలుగులోకి వచ్చింది. గతంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం, ఈ అద్భుత ఆవిష్కరణతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గోదావరి పరిక్రమ యాత్రకు వచ్చిన సాధుసంతులు, ఈ ప్రాంతంలో మహిమాన్విత అమ్మవారు ఉన్నారని చెప్పడంతో, ఓ ప్రైవేట్ భూమిలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో సింహవాహిని అలంకారంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. అమ్మవారు బయటపడిన వార్త వ్యాపించడంతో, భక్తులు పెద్ద ఎత్తున ముల్కలకు తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ విగ్రహావిష్కరణతో ఈ ప్రాంతం త్వరలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని స్థల యజమాని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్‌

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గ్రీన్ రికార్డు

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం.. ఆన్‌లైన్‌లో కెమికల్స్ కొని దర్జాగా డ్రగ్స్ తయారీ

Loading...
Unable to load recommendations.
Follow Us