నదిలో శివలింగం, నంది దర్శనం.. శివయ్యే వచ్చాడంటూ

Updated on: Nov 17, 2025 | 5:30 PM

ప్రకాశం జిల్లా, గుండ్లకమ్మ నదిలో ప్రాచీన శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో కార్తీకమాసంలో వరదల కారణంగా నది గర్భం నుండి ఈ దైవ విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థులు వీటిని సాక్షాత్తు శివుని దర్శనంగా భావించి పూజలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో గుడి నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ అద్భుత దృశ్యం స్థానికులలో భక్తి భావాన్ని నింపింది.

ప్రకాశంజిల్లాలో గుండ్లకమ్మ నదిలో ప్రాచీన శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో గుండ్లకమ్మ నది గర్భంలో ఈ విగ్రహాలను గ్రామస్థులు గుర్తించారు. కార్తీకమాసంలో నంది సహా..శివలింగం బయటపడటంతో తమ గ్రామానికి సాక్షాత్తూ శివుడే వచ్చాడంటూ గ్రామంలో ప్రచారం జోరందుకుంది. ఈ విగ్రహాలను చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో నదీతీరానికి చేరుకున్నారు. నదిలో బయటపడ్డ శివలింగానికి, నంది విగ్రహాలకు గ్రామస్థులు పూజలు చేశారు. ముష్ట్ల గంగవరం దగ్గర తంగిరాల గ్రామం పక్కనే గుండ్లకమ్మ నది రెండు పాయలుగా విడిపోయి కిందకు వెళ్ళే కొద్ది తిరిగి కలిసి ప్రవహిస్తుంటుంది. ఈ రెండు పాయల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ విగ్రహాలను గుర్తించారు. ఇటీవల మొంథా తుఫాను కారణంగా గుండ్లకమ్మ నదికి వచ్చిన వరద వల్ల రెండు పాయల మధ్య ఉన్న మట్టికొట్టుకుని పోయి విగ్రహాలు బయటపడ్డాయి. నదిలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు ఈ విగ్రహాలు కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. కార్తీకమాసం శుభవేళ నదిలో శివలింగం, నంది విగ్రహాలు బయటపడటం యాధృచ్చికం కాదని, సాక్షాత్తూ శివయ్యే ఇలా దర్శనమిచ్చాడంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో గుడికట్టేందుకు గ్రామస్థులు సిద్దమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంటచేసేందుకు కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి షాక్

మన ఖర్మ బాగాలేకపోతే.. ఇంతేనేమో ??

వామ్మో…అక్కడికెలా వెళ్లావురా సామీ !!

EPF: పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాలా ??

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి