మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
అనకాపల్లి తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలాన్ని మత్స్యకారులు విజయవంతంగా సముద్రంలోకి పంపారు. అయితే, విశాఖ యారాడ తీరంలో ఇసుకలో కూరుకుపోయిన తిమింగలాన్ని రక్షించలేకపోయారు, అది అక్కడే ప్రాణాలు కోల్పోయింది. సముద్ర జీవుల సంరక్షణ ఎంత ముఖ్యమో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి. మత్స్యకారుల కృషి, తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఈ సంఘటనలు నొక్కి చెబుతున్నాయి.
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. అక్కడ ఇసుకలో కూరుకుపోయి కదల్లేక అలాగే ఉండిపోయింది. తిమింగలాన్ని గుర్తించిన స్థానిక మత్స్యకారులు కష్టపడి దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించారు. దాంతో తిమింగలం ఊపిరి పీల్చుకుంది. హాయిగా ఈదుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. ఇటీవల విశాఖ జిల్లా యారాడ సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. కొనఊపిరితో.. అలల తాకడికి అటు ఇటు కదులుతూ కనిపించింది. దాదాపుగా 15 అడుగుల పొడవున్న ఈ తిమింగలం చూసేందుకు.. అక్కడున్న సందర్శకులు పోటీపడ్డారు. ఆ తిమింగలాన్ని మళ్లీ సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నం చేశారు మత్సకారులు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఒడ్డునే ఆ తిమింగలం ప్రాణాలు కోల్పోయింది. దీంతో సందర్శకులు, మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందారు. టన్నుల కొద్దీ బరువుండే తిమింగలాలు నడి సముద్రంలో సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల తరచూ అవి సముద్ర తీరానికి కొట్టుకొస్తున్నాయి. కొన్ని ప్రాణాలు కోల్పోయి కొట్టుకొస్తుంటే..కొన్నిటిని మత్స్యకారులు గమనించి సముద్రంలోకి పంపిస్తున్నారు. సముద్రం మీద తాము బతుకున్నట్లే.. అనంతమైన ప్రాణి కోటి జీవిస్తోందని, ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని వారు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే
ఊబకాయాన్ని తగ్గించే బ్యాక్టీరియా.. పరిశోధకుల కీలక ముందడుగు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు