Young Man Innovative Effort: ఉద్యోగ వేటలో యువకుడి వినూత్న ఆలోచన.. ఆఫీసు భవనాల ముందు..

Updated on: Jul 04, 2022 | 9:05 AM

ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సీవీతో ఆఫీసులకు వెళ్లడం, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకుండా తిరిగి రావడం చాలా మందికి జరుగుతూనే ఉంది.


ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సీవీతో ఆఫీసులకు వెళ్లడం, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకుండా తిరిగి రావడం చాలా మందికి జరుగుతూనే ఉంది. వీరిలో ఒకరు 21 ఏళ్ల జార్జ్ కోర్నియుక్. అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సెయింట్ ఎడ్మండ్ కళాశాలలో ఎకనామిక్స్ చదువుతున్నాడు. అయితే జార్జ్ కు బ్యాంకింగ్ లేదా బీమా రంగంలో ఉద్యోగానుభవం అవసరం. దీంతో అతను వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏ కంపెనీ కూడా జార్జ్ ను ఉద్యోగానికి పిలవక పోవడంతో విసిగిపోయాడు. ఎక్కడికెళ్లినా తిరస్కారమే ఎదురవుతోంది. దీనితో కలత చెందిన జార్జ్ వినూత్నంగా ఆలోచించాడు. ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందిన అతను CVలతో కూడిన QR కోడ్‌ను ఆఫీసు భవనం బయట అతికించాడు. ఈ కోడ్ జార్జ్ CV , లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ కు లింక్ అయి ఉంటుంది. ఆ QR కోడ్‌ని స్కాన్ చేసే వారికి జార్జ్ CV , లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇలా సరికొత్త విధానంతో ఉద్యోగం వెతుక్కోవడం మొదలు పెట్టాడు జార్జ్‌. ఈ ఆలోచన చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ది మిర్రర్ కథనం ప్రకారం.. లండన్ కు చెందిన ఓ వ్యక్తి కథను చదివిన తర్వాత జార్జ్‌కి ఈ ఆలోచన వచ్చిందట. లండన్ కు చెందిన వ్యక్తి కూడా ఉద్యోగంలో చాలా తిరస్కరణలను ఎదుర్కొన్న తర్వాత ఇలాంటి సృజనాత్మక విధానాన్ని అనుసరించాడట. అతను కూడా ఆఫీస్ భవనాల వెలుపల CVతో కూడిన QR కోడ్‌ను అతికించాడట. జార్జ్ కూడా అదే విధానాన్ని అవలంబించారు. అయితే ఇప్పటి వరకూ జార్జ్ ఆలోచన వర్కౌట్ కాలేదు.. అయితే చాలా కంపెనీలు జార్జ్ CV ని చూశాయని మాత్రం తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 04, 2022 09:05 AM