Mega Beach Cleaning: కోనసీమ తీరంలో ‛మెగా బీచ్ క్లీనింగ్’.. చెత్త ఎత్తిన అమెరికన్లు.. వీడియో.
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం ప్రాంతంలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛత నెలకొల్పే లక్ష్యంగా మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. అమెరికాకు చెందిన స్మార్ట్ విలేజ్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌లో బీచ్ క్లీనప్ కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం ప్రాంతంలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛత నెలకొల్పే లక్ష్యంగా మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. అమెరికాకు చెందిన స్మార్ట్ విలేజ్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌లో బీచ్ క్లీనప్ కార్యక్రమం చేపట్టారు. తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఖాళీ గాజు సీసాలు సేకరించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రంలో సఖినేటిపల్లి మండలం మోరి రివర్ సైడ్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు అమెరికాకు చెందిన జెల్లీ ఫ్లోరా రాణి డార్విన్ పాల్గొన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన స్మార్ట్ విలేజ్ మూవ్‌మెంట్ ఉద్యమకర్త రివర్ సైడ్ స్కూల్ అధినేత నల్లి డార్విన్ అమెరికాలో స్థిరపడ్డారు. పర్యావరణ ప్రేమికురాలు, అంతర్జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిన ఆయన కుమార్తె రాణి డార్విన్ తమ తండ్రి స్వగ్రామమైన మోరికి ప్రతి ఏటా వస్తున్నారు. ఈ క్రమంలో సముద్రతీరంలో ఏడాదికి ఏడాది చెత్త వ్యర్ధాలతో కాలుష్యకారకంగా మారడం గమనించారు. ఈ క్రమంలోనే ఎంతో సుందరమైన సముద్ర తీరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని ఉద్దేశంతో రివర్స్ సైడ్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బందితో కలిసి బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!