అయ్యో ఈ మూగజీవికి ఎంత కష్టం వచ్చింది

Updated on: Nov 01, 2025 | 11:55 AM

సాటి మనషి ప్రమాదంలో ఉంటే ఆదుకోవడం మానవ సహజం. అలాగే పశుపక్ష్యాదుల పట్లకూడా జాలి,దయ కలిగి ఉండాలి అంటారు పెద్దలు. అది అక్షరాలా పాటించారు ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పట్టణ ప్రజలు. ఆపదలో ఉన్న ఓ మూగజీవిని చూసి కరిగిపోయిన స్థానికులు ఒకరికొకరు తోడై పెద్దసంఖ్యలో జనాలు అక్కడికి చేరి ఆ ప్రాణిని కాపాడారు.

ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ పార్కులోకి ఒక ఆంబోతు వెళ్లింది. ఆ తర్వాత పార్క్‌లోంచి బయటకు వచ్చే క్రమంలో పార్క్‌కు కంచెలా ఏర్పాటు చేసిన ఇనుపగ్రిల్‌ను దాటబోయింది. అయితే దాని ప్రయత్నం ఫలించలేదు. ఇనుప గ్రిల్‌కు మధ్యలో ఇరుక్కుపోయింది. గ్రిల్‌ ఎత్తుగా ఉండటంతో వెనక్కి వెళ్లలేక..ముందుకి దూకలేక నానా అవస్థలు పడింది. ఎవరైనా వచ్చి సహాయం చేయకపోతారా అని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఇనుప గ్రిల్‌ దాటలేక ఇబ్బంది పడుతున్న ఆబోతును అటుగా వెళుతున్న స్థానికులు చూసి వెంటనే స్పందించారు. పదుల సంఖ్యలో అక్కడకు చేరి ఆంబోతును గ్రిల్‌ దాటించే ప్రయత్నం చేశారు. మూగ జీవం కావడంతో నోరు ఉన్న బయటకు చెప్పలేక నరకయాతన అనుభవించింది ఆంబోతు. మొదట ఆబోతు కు కడుపులో గుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఐరన్ గ్రిల్స్ ను వంగదీసి ఆంబోతు ప్రాణాలను రక్షించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు కూడా ఈ ఘటన చూసి స్థానికులకు సహాయం చేశారు. మొత్తానికి పోలీసులు, స్థానికులు కలిసి ఆంబోతును సురక్షితంగా ఇనుపగ్రిల్‌ను దాటించారు. తనను కాపాడిన స్థానికులను కృతజ్ఞతలు అన్నట్టుగా వారందరినీ చూస్తూ ఆంబోతు అక్కడినుంచి వెళ్లిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌ అలర్ట్‌ వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఇది తప్పనిసరి

కాలర్ ఐడీ వచ్చేస్తోంది ఇక ఫేక్ కాల్స్‌కు చెక్

కారు సైడ్ మిర్రర్‌కు డాష్ ఇచ్చాడని.. కక్షతో బైకర్‌ను వెంబడించి మరీ..

ఆకాశంలో వింత కాంతులు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యం

ప్రియుడి పైశాచికత్వం.. పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తా