ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా

Updated on: Dec 24, 2025 | 1:51 PM

అల్లూరి జిల్లాలోని బలిమెల జలాశయంలో ఓ గిరిజన మత్స్యకారుడి వలకు ఊహించని భారీ చేప చిక్కింది. ఏకంగా 55 కేజీల బరువున్న ఈ చేప ₹15 వేల వరకు ధర పలికింది. సాధారణంగా చిన్న చేపలు దొరికే చోట, ఇంత పెద్ద చేప దొరకడం మత్స్యకారుల కుటుంబంలో సంతోషం, సిరులు కురిపించింది. ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రతిరోజూ మత్స్యకారులు తమ వలనిండా చేపలు పడాలని, మంచి లాభాలు రావాలని గంగమ్మను మొక్కుతూ చేపలవేటకు వెళ్తారు. ఒక్కోసారి వారు ఊహించని విధంగా వలలో చేపలు పడుతూ ఉంటాయి. అవి భారీ ధర పలకడంతో మత్స్యకారుల ఇంట సిరులు కురిపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది అల్లూరి జిల్లాలో. మత్స్యకారుడి వలకు ఎవరూ ఊహించనంత పెద్ద చేప చిక్కింది. అల్లూరి జిల్లా ఒడిశా సరిహద్దులో బలిమెల జలాశయం ఉంది. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి నీటిని అందించే ఆ జలాశయంలో గిరిజన మత్స్యకారులు తరచూ చేపల వేట చేస్తూ ఉంటారు. రోజు మాదిరిగానే ఆదివారం కూడా ఒడిస్సా మల్కనగిరి జిల్లా జంత్రి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన మత్స్యకారులు వేటకు వెళ్లారు. చేపల కోసం వల వేసి చూస్తున్నారు.. ఇంతలో వారు విసిరిన వల బరువెక్కింది. దీంతో వలను లాగేందుకు ప్రయత్నించారు.. అయితే వలను లాగడం వారివల్ల కాలేదు. దీంతో పక్కనున్న వారి సహాయంతో వలను బయటకు తీసుకొచ్చారు. అంతే ఆ వలలో చిక్కిన భారీ చేపను చూసి అందరూ షాకయ్యారు. ఆ వలలో ఏకంగా 55 కేజీల బరువైన భారీ చేప చిక్కింది. ఆ చేపను జాగ్రత్తగా పట్టుకొని ఒడ్డుకు చేర్చారు ఆ మత్స్యకారులు. బలిమెల రిజర్వాయర్లో రకరకాల చేపలు పడుతుంటాయి. చిన్న చేపల నుంచి 20 కిలోల వరకు చేపలు పడతాయి. ఒక్కోసారి భారీ చేపలు కూడా వలకు చిక్కుతూ ఉంటాయి. వాటిలో పెద్ద తల ఉండే చేపను దోబీ చేప అని పిలుస్తారు మత్స్యకారులు. ఈసారి ఊహించనివిధంగా 55 కిలోల పెద్ద చేప దొరికింది. దీంతో మత్స్యకారులు ఎగిరి గంతేశారు. చేపను కర్రకు కట్టుకొని భుజాలపై మోస్తూ తీసుకొచ్చారు. ఆ చేపను చూసేందుకు కొందరు.. కొనేందుకు మరికొందరు పోటీపడ్డారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. చివరికి ఈ చేప దాదుపుగా పదిహేను వేల రూపాయల వరకు ధర పలికినట్టు మత్స్యకారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంచెకట్టులో బౌండరీ షాట్స్‌.. పురోహితుల క్రికెట్‌ టోర్నమెంట్‌ అదుర్స్‌

చిన్నారి ఫ్యాన్ కు స్మృతి మంధాన రిప్లై టీ20ల్లో రికార్డు

వాట్సప్ యూజర్స్… బీ అలర్ట్… ఘోస్ట్‌ పెయిరింగ్‌‌కు చెక్ పెట్టండిలా

Dhurandhar: ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి! పాకిస్తానీల వింత డిమాండ్

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు

Published on: Dec 24, 2025 01:47 PM