Isha Ambani: ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ వారసులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన కుమార్తె ఈశా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ రోల్స్ రాయిస్ ఓపెన్ టాప్ కారులో ఇటీవల రాత్రి సమయంలో ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. వీరితో పాటు ఆకాశ్ సతీమణి శ్లోకా మెహతా కూడా ఉన్నారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆకాశ్ రోల్స్ రాయిస్‌ను నడుపుతుండగా.. ఆయన పక్కనే ఈశా కూర్చున్నారు. వెనక సీట్లో శ్లోకా ఉన్నారు. రాత్రి వేళ అంబానీలు సరదాగా రైడ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వారి కారు వెనకే భద్రతా సిబ్బంది ప్రయాణించారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘‘సామాన్యుల వలే వారికీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది’’.. ‘‘కుటుంబంతో జాలీ రైడ్.. వాట్ ఏ మూమెంట్’’ అంటూ కామెంట్లు చేశారు. కాగా.. ఇటీవల ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో కుటుంబసభ్యులతో పాటు సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు సందడి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.