ఆకాశంల 13 గంటలు తిప్పి తిప్పి ఎక్కిన చోటే దించిన విమానం !!

|

Feb 04, 2023 | 7:39 AM

దేవుడా..పగోల్లకు కూడ ఈ పరిశితి రావొద్దు పోండ్రి..పదమూడు గంటలు ఇమానంలనే కాల్లు మల్సుకోని కూసోని.. గిర్ర గిర్ర తిర్గి మల్ల ఎక్కిన జాగల్నే దిగుతే ఎట్లుంటది చెప్పుండ్రి..

దేవుడా..పగోల్లకు కూడ ఈ పరిశితి రావొద్దు పోండ్రి..పదమూడు గంటలు ఇమానంలనే కాల్లు మల్సుకోని కూసోని.. గిర్ర గిర్ర తిర్గి మల్ల ఎక్కిన జాగల్నే దిగుతే ఎట్లుంటది చెప్పుండ్రి..ఇమానాన్ని అగ్గంటువెట్టాలన్నంత కోపమొస్తది గద.. నిన్న దుబాయి కెంచి న్యూజిలాండుకు పోదామని ఇమానం ఎక్కిన ప్యాసింజర్లకు కూడ గట్నే అన్పిచ్చిందట..పొద్దుగాల పదన్నిరకు దుబాయి ఎయిర్‌ పోర్టునుంచి న్యూజిలాండులున్న అక్లాండ్‌కు పోయే ఇమానం గాల్లేకు ఎగ్రిందట. అయితే ఇగ సగం దూరంపోతే అక్లాండ్‌ అస్తదనంగ న్యూజిలాండ్ ఎర్‌పోర్ట్‌ శాఖోల్లు న్యూజిలాండులు ఇప్పుడేడా ఇమానం దిగే పరిశితులు లెవ్వు.. మాకాడ మస్తు వర్దలొచ్చి అంత పర్షాన్‌ పర్షాన్ ఉన్నది. రన్‌ వేలన్ని మున్గిపోయి ఉన్నయి.. వాతవర్ణం అంత ఆగమాగమున్నది.. అస్సలు ఇమానాలేవి దిగేతందుకు మేం పర్మిషన్‌ ఇస్తలేం..దయచేసి అచ్చిన తొవ్వల్నే మర్రిపోండ్రి అని పైలెట్లకు మత్లావ్ పంపిండ్రట .

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్తీకదీపం సిరియల్ చూడనివ్వలేదని వేలు కొరికిన వంటలక్క ఫ్యాన్స్

Published on: Feb 04, 2023 07:39 AM