Air India: న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?

|

Oct 16, 2024 | 12:49 PM

ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి ఈ తెల్లవారుజాము న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్‌ ఢిల్లీకి మళ్లించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారి ఒకరు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి ఈ తెల్లవారుజాము న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పైలట్‌ ఢిల్లీకి మళ్లించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారి ఒకరు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్‌ అవ్వడంతో పైలట్‌కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కు మళ్లించారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌ సదుపాయాలు ఏర్పాటు చేశారు. విమానం ఎయిర్‌పోర్ట్‌ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు తరలించారు. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి పంపించారనేది తెలియరాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 16, 2024 11:00 AM