ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
ఏఐ రంగంలోకి మారుతున్న ఉద్యోగులకు భారీ వేతనాల పెరుగుదల లభిస్తోందని స్కేలర్ AI వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు సగటున 145 శాతం వరకు జీతాల పెరుగుదల పొందుతున్నారని పేర్కొంది. క్యూఏ ఇంజినీర్ల వేతనాలు 574 శాతం వరకు పెరిగినట్లు తెలిపింది. హెచ్‌ఆర్, మార్కెటింగ్, విద్య, ఫైనాన్స్ వంటి రంగాల్లోనూ ఏఐ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
జీతాల విషయానికొస్తే ఇన్నాళ్లు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ టాప్ అనుకుంటే.. అంతకు మించిన శాలరీలతో ఏఐ ఆకర్శిస్తోంది. ప్రస్తుతం టెక్ ఉద్యోగులు ఏఐ వైపు షిఫ్ట్ అయ్యేందుకు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొత్త జనరేషన్ కు ఏఐ కెరీర్ ఊహించని రీతిలో బూస్టింగ్ ఇస్తోంది. అయితే ఈ ట్రాన్స్ ఫార్మేషన్ లో పురుషుల కంటే మహిళలే టాప్ గేర్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ జాబ్స్ లో మహిళలే బిగ్ విన్నర్స్ అని స్కేలర్ అనే లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. స్కేలర్ AI వర్క్‌ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం.. AI ని కెరీర్ గా ఎంచుకునే మహిళలు, ఏఐ కి షిఫ్ట్ అవుతున్న విమెన్, శాలరీ హైక్స్ లో యావరేజ్ గా 145 శాతం పొందుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న టెక్ ఉద్యోగాలతో పోల్చితే ఏఐ అవకాశాలు ఎలా మార్చుతోందో రిపోర్ట్ తెలిపింది. ఇండియా వ్యాప్తంగా 11,444 మందిని సర్వే చేయగా ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పరిమితమైన స్కిల్ కాకుండా, టోటల్ వర్క్ ఫోర్స్ కు సంబంధించినదిగా తెలిసింది. హెచ్‌ఆర్, విద్యా రంగం, మార్కెటింగ్ లోని ఏఐ అవకాశాలలో మహిళలు దూసుకుపోతున్నారట. ఏఐ స్కిల్స్ పెంచుకున్న QA ఇంజనీర్ల జీతాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నట్లు తెలిపింది. క్యూఏ ఇంజినీర్ల రంగంలో జీతభత్యాలు ఏకంగా 574 శాతం వరకు పెరిగినట్లు సర్వేలో తేలింది. ప్రస్తుతం ఏఐ నేర్చుకునేవారిలో దాదాపు 25 శాతం మంది టెక్నాలజీ బ్యాగ్రౌండ్ లేని వారే నని రిపోర్ట్ తెలిపింది. అంతేకాకుండా, ఏఐ బేస్డ్ జాబ్స్ లో కేవలం 50 శాతం మాత్రమే ఇంజనీరింగ్ బ్యాగ్రౌండ్ నుంచి ఉన్నారు. లీడర్షిప్, కన్సల్టింగ్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, విద్యా రంగానికి ఏఐ విస్తరిస్తోంది. AI కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను సృష్టిస్తోంది, కెరీర్ డెవలప్మెంట్ ను వేగవంతం చేస్తోంది. ఆ యా రంగాలలో ఎక్స్ పర్ట్స్ హై శాలరీ పొందేలా చేస్తోంది. AI గురించి మాట్లాడుతున్న ప్రతీసారి ఉద్యోగాలు పోతాయనే చర్చలే నడుస్తున్న తరుణంలో, ఈ రిపోర్ట్ అందుకు భిన్నంగా వాదిస్తోంది. ఇండియాలోని AI ట్యాలెంట్ ప్రపంచంతో పోటీ పడుతోందని నివేదిక తెలిపింది. ఇప్పుడు AI నేర్చుకునేవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు లక్నో , పాట్నా, కోయంబత్తూర్, జైపూర్, ఇండోర్, నాగ్‌పూర్ వంటి టైర్-II సిటీలలో ఉన్నవారేనట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకలేస్తుందని చల్లబజ్జీలు తిన్నారు.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 50 మంది..
హోంమంత్రి అనిత మంచి మనసు.. మహిళా ఎస్సైకి ఘనంగా సీమంతం
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు!
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!
