రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..

Updated on: Apr 01, 2025 | 2:39 PM

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామస్తులకు కష్టాలు తప్పడం లేదు. ఒకరిదో ఇద్దరిదో‌ కాదు ఊరందరిది ఒకటే కష్టం. లక్క పురుగుల దండయాత్ర కష్టం. ప్రతి రోజు సాయంత్రం ఆరు దాటిందే చాలు కొల్హారి గ్రామంపై దయాగాడి దండయాత్ర అన్న తీరున లక్క పురుగులు ముప్పెట దాడి చేస్తున్నాయి.

తినే అన్నం , తాగే నీళ్లు , చివరికి ఇంట్లోని సామాన్లు , నిత్యవసర సరుకులపై వాలి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పురుగుల దాడితో మూడు నెలలుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇక ఈ పురుగులతో వేగలేం అంటూ ఏకంగా ఆందోళనకు‌ దిగారు గ్రామస్తులు. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను కొల్హారీ గ్రామం వద్ద గోదాంలో నిల్వ చేశారు మార్క్ ఫెడ్ అధికారులు. ఏడాది నుంచి గోదాంలోనే జొన్నలు నిల్వ ఉండటంతో జొన్నలకు పురుగులు పట్టాయి. అధికారులు పురుగుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పురుగుల తీవ్రత పెరిగింది. గోదాంకు సమీపంలోనే గృహ సముదాయాలు ఉండటంతో సాయంత్రం గోదాం నుండి పెద్ద ఎత్తున ఊరి మీద పడుతున్నాయి పురుగులు. పురుగుల నుండి తమకు‌ విముక్తి‌కలిగించాలంటూ బాధిత గ్రామస్తులు‌ ఏకంగా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన మార్క్ ఫెడ్ అధికారులు గోదాంను పరిశీలించి పురుగుల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన‌ అధికారులు గోదాం నుంచి పురుగులు పట్టిన జొన్నలను తీసేస్తామని కొల్హారి వాసులకు తెలిపారు. రెండు మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపకపోతే గోదాంను ముట్టడిస్తామని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు గ్రామస్తులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరగడుపున.. ఈ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో దాన్ని అలా కొరికేసిందేంటి !!