Teak fish: అరుదైన టేకు చేప..ధర కూడా భారీగానే..! టేకు చేపను చూసేందుకు ఎగబడ్డ జనం.. (వీడియో)

Updated on: Jan 06, 2022 | 9:54 AM

గుంటూరు జిల్లాలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది..దాచేపల్లి మండలం తంగెడ కృష్ణా నదిలో భారీ టేకు చేప జాలర్ల వలలో పడింది.. తంగెడ గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఈ చేప చిక్కింది. ఇలాంటి టేకు రకం చేపలు సముద్రంలోనే ఉంటాయి...


గుంటూరు జిల్లాలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది..దాచేపల్లి మండలం తంగెడ కృష్ణా నదిలో భారీ టేకు చేప జాలర్ల వలలో పడింది.. తంగెడ గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఈ చేప చిక్కింది. ఇలాంటి టేకు రకం చేపలు సముద్రంలోనే ఉంటాయి…భారీ సైజులోని టేకు చేపలు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకార వలలకు చాలా అరుదుగా పడుతుంటాయి…రెండు, మూడు వందల కేజీలుండే టేకు చేపలు సముద్రంలోనే పెరుగుతుంటాయి. సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం.. అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అరుదైన చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.భారీ చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించారు..దీన్ని పట్టుకునే క్రమంలో మూడు వలలు పాడైనట్లు జాలరీ జాన్ తెలిపారు. ఈ చేపకు మార్కెట్లో ఇరవై వేల రూపాయల ధర పలికిందన్నారు. భారీ టేకు చేపలు నదిలో దొరకటం అరుదగా జరుగుతుంటుందన్నారు జాలర్లు.

Follow Us