Mr.Groom: ఇది పెళ్లి కొడుకు స్వయంవరం..! వధువు కావాలి అంటూ ఆహ్వాన పత్రికలు..

|

Oct 16, 2023 | 9:43 AM

తనను ఇష్టపడే అమ్మాయిలు వివాహమాడేందుకు తన ఇంటికి నేరుగా రావాలని, తన పేరు రిజిస్టర్‌ చేసుకోవాలని ఏకంగా టెంట్‌ వేసుకొని కూర్చున్నాడు ఓ యువకుడు. అవును బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్‌ అనే యువకుడు తనకు పెళ్లి కాకపోవడంతో వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. తనకు తాను స్వయం వరం ప్రకటించుకున్నాడు.

తనను ఇష్టపడే అమ్మాయిలు వివాహమాడేందుకు తన ఇంటికి నేరుగా రావాలని, తన పేరు రిజిస్టర్‌ చేసుకోవాలని ఏకంగా టెంట్‌ వేసుకొని కూర్చున్నాడు ఓ యువకుడు. అవును బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్‌ అనే యువకుడు తనకు పెళ్లి కాకపోవడంతో వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. తనకు తాను స్వయం వరం ప్రకటించుకున్నాడు. చీరాలలోని వీధి వీధికి సైకిలేసుకొని తిరుగుతూ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాడు. తనను పెళ్ళి చేసుకోదలచిన వారు తమ పేరు ఫోన్ నంబర్ ను తన వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, లేదా స్వయంగా తన ఇంటికి రావాలంటూ చెబుతున్నాడు. అదికూడా తెల్లవారుజామున 3 గంటలనుంచి ఉదయం 6 గంటలలోపు తనను కలవాలని ఇంటి గోడలపై రాశాడు. అంతేకాదు, తనతో నేరుగా మాట్లాడగల అమ్మాయిలు మాత్రమే తనను సంతృప్తిగా కలవగలరు అంటూ రాశాడు. గతంలో కూడా ఇలాగే చేయడంతో అయ్యప్ప కుమార్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలుసుకున్న పోలీసులు మందలించి వదిలేశారు. నీలకంఠం మళ్లీ తన పెళ్లికి తెరతీశాడు. తాజాగా తనను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఏకంగా ఆహ్వాన పత్రిక తో కౌంటర్లనే ఏర్పాటు చేశాడు. తాను కేవలం తన పెళ్ళికోసం ఏర్పాటు చేసుకున్న స్వయంవరం మాత్రమేనని ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదని అయ్యప్ప కుమార్ చెబుతున్నాడు. పెళ్ళి కోసం అయ్యప్పకుమార్‌ ఎంచుకున్న పద్దతిని చూసి జనం విస్తుపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..