Viral Video: నడిరోడ్డుపై మంచం వేసుకొని పడుకున్న యువకుడు.. ఎందుకో తెలుసా.?

|

Aug 01, 2023 | 8:55 AM

ఏపీలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. అసలే గుంతల రోడ్లపై ఎగిరిపడుతున్న వాహనాలతో నడుములు విరగ్గొట్టుకుంటుంటే వర్షాలకు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఏలూరు జిల్లాలో ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గుంతల రోడ్లపై అతికష్టం మీద రాకపోకలు సాగిస్తూ నానా అవస్థలు పడుతున్నారు వాహనదారులు.

ఏపీలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. అసలే గుంతల రోడ్లపై ఎగిరిపడుతున్న వాహనాలతో నడుములు విరగ్గొట్టుకుంటుంటే వర్షాలకు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఏలూరు జిల్లాలో ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గుంతల రోడ్లపై అతికష్టం మీద రాకపోకలు సాగిస్తూ నానా అవస్థలు పడుతున్నారు వాహనదారులు. అయితే స్ధానిక మాదేపల్లి రోడ్డులోని ఫిల్ హౌస్ పేట వద్ద ఒక యువకుడు రోడ్డుపై నీళ్లు నిలిచిన గుంతలో మంచం వేసి పడుకుని తన నిరసన తెలిపాడు. ఏలూరు నర్సాపురం రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది.

అధ్వానంగా తయారైన రహదారులపై నిత్యం నరకం చూస్తున్నామని.. గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. దీంతో ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌హౌస్‌పేట వద్ద మడుగులా మారిన రోడ్డు మీద జూలై 22 సాయంత్రం మంచం వేసుకుని పడుకున్నాడు. అటుగా వస్తున్న బస్సును ముందుకు వెళ్లనీయకుండా గంటసేపు ఆపేసి నిరసన తెలియజేశాడు. తర్వాత స్థానికులు అతనికి సర్దిచెప్పి పక్కకు తీసుకురావటంతో బస్సు కదిలింది. మద్యం మత్తులో యువకుడు ఇలా చేసినా ప్రజలు పడుతున్న అవస్థలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...