Railway Job: రైల్వే జాబ్‌కోసం ఈ యుకుడు ఏం చేశాడో చూడండి.. అధికారులతో సహా అందరూ షాకె..
అతను ఎలాగైనా రైల్వేలో జాబ్ సంపాదించాలనుకున్నాడు. జాబ్ కోసం అప్లై చేసుకున్నాడు. పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ కూడా వచ్చింది. ఇప్పుడే అతనికి అసలు టెన్షన్ మొదలైంది. తను పరీక్షరాయలేనని,
అతను ఎలాగైనా రైల్వేలో జాబ్ సంపాదించాలనుకున్నాడు. జాబ్ కోసం అప్లై చేసుకున్నాడు. పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ కూడా వచ్చింది. ఇప్పుడే అతనికి అసలు టెన్షన్ మొదలైంది. తను పరీక్షరాయలేనని, రాసినా పాస్ కానని అర్ధమైంది. దాంతో స్నేహితుడి సహాయం కోరాడు.. అందుకు మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. వారిద్దరూ కలిసి ఏం చేశారో తెలుసా.. విషయం తెలిస్తే షాకవుతారు.. బీహార్ లోని ముంగేర్ ప్రాంతానికి చెందిన మనీష్ కుమార్ అనే కుర్రాడు రైల్వే శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. వడోదరలో పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ వచ్చింది. అయితే మిత్రుడి తరఫున పరీక్ష రాసేందుకు గుప్తా రెడీ అయ్యాడు. కానీ పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు విధానం ఉండడంతో, మనీష్ కుమార్ తన బొటనవేలిని వేడివేడి పెనంపై ఉంచాడు. దాంతో అతడి బొటనవేలి చర్మం ఊడొచ్చింది. ఆ చర్మాన్ని తన మిత్రుడు రాజ్యగురు గుప్తాకు జాగ్రత్తగా ఇచ్చాడు. ఆ చర్మాన్ని గుప్తా తన బొటనవేలుకి అతికించుకొని పరీక్ష రాసేందుకు వెళ్లాడు. అయితే, పరీక్ష కేంద్రం వద్ద అతడి బండారం బయటపడింది. ఎగ్జామినర్ శానిటైజర్ వేయడంతో, అది చేతులకు రుద్దుకునే క్రమంలో చర్మం ఊడి కిందపడిపోయింది. తిరిగి దాన్ని అతికించుకునే క్రమంలో తడబాటుకు గురయ్యాడు. అంతేకాదు ఎన్నిసార్లు థంబ్ వేసినా, నిరాకరణకు గురైంది. ఇదంతా గమనించిన ఎగ్జామినర్ అతడి ధోరణి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించడంతో అతడి గుట్టురట్టయింది. విచారణ జరిపిన పోలీసులు మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తాలను అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 465, 419, 120-బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..