Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

|

Jul 12, 2022 | 9:56 PM

ఇటీవల చాలామంది తమ అందానికి మెరుగులు దిద్దుకునే క్రమంలో రకరకాల పద్ధతులు అవలంభిస్తున్నారు. తాజాగా ఓ యువతికి తన కనుబొమ్మలను అస్సలు నచ్చలేదు. దీంతో ఎవరూ

తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ.. - TV9
ఇటీవల చాలామంది తమ అందానికి మెరుగులు దిద్దుకునే క్రమంలో రకరకాల పద్ధతులు అవలంభిస్తున్నారు. తాజాగా ఓ యువతికి తన కనుబొమ్మలను అస్సలు నచ్చలేదు. దీంతో ఎవరూ ఊహించని విధంగా కనుబొమ్మలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది. ఇప్పటి వరకూ బట్టతల వెంట్రుకల కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం గురించి విన్నాం..చూశాం… ఇప్పుడు కనుబొమ్మలపై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మిర్రర్ యొక్క నివేదిక ప్రకారం.. ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువతి చిన్న వయస్సులో అనుకోకుండా తన కనుబొమ్మల వెంట్రుకలను తీసివేసింది. ఆమె కనుబొమ్మలు తక్కువ వెంటుకలతో పల్చగా ఉన్నాయి. దీంతో తన కనుబొమ్మలు అందంగా కనిపించడం కోసం కనుబొమ్మల మార్పిడి చేసుకోవాలని ఆలోచించింది. అందుకోసం పోలెండ్ వెళ్లి సర్జరీ చేయించుకుంది. అందుకు సుమారు 1లక్ష 41 వేల రూపాయలు ఖర్చు చేసి మరీ కనుబొమ్మలు దట్టంగా తయారు చేసుకుంది.
అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫలితంగా.. తలపై జుట్టు పెరిగితే.. ఎలా హెయిర్ కటింగ్ చేసుకోవాల్సి వస్తుందో.. అదే విధంగా ఈ యువతి ఎప్పుడూ తన కనుబొమ్మలను కత్తిరించుకోవాల్సి వచ్చింది. అయితే తనకు ఇలా కనుబొమ్మలపై హెయిర్ పెరగడం ఏమాత్రం ఇబ్బందిగా లేదని, కనుబొమ్మలు వికారంగా కనిపించకుండా అందంగా కనిపించేలా ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నానని యువతి చెప్పింది. అంతేకాదు.. దీని కోసం షెడ్యూల్‌ను తయారు చేసుకుని.. క్రమం తప్పకుండా కనుబొమ్మలను కత్తిరించుకుంటానని చెబుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 12, 2022 09:56 PM