Woman Raising Frogs: కప్పల్ని పెంచుకుంటున్న యువతి.. కప్పలు ఎప్పుడూ నవ్వుతూ గిగీ.. (వీడియో)
సాధారణంగా ఎవరైనా కుక్కలు, పిల్లులను పెంచుకోవడం చూశాం. అయితే ఇక్కడ ఓ యువతి కప్పల్ని పెంచుకుంటోంది. గిగి విటాలే అనే 13 ఏళ్ల అమ్మాయి 2 గ్రీన్ కలర్ కప్పలను పెంచుకుంటోంది. అవంటే ఆమెకు ప్రాణం. 5 నెలలుగా వాటితో ఎంతో స్నేహంగా ఉండే గిగీకి అవి ఆమె ఇంటి పెరట్లో దొరికాయట.
సాధారణంగా ఎవరైనా కుక్కలు, పిల్లులను పెంచుకోవడం చూశాం. అయితే ఇక్కడ ఓ యువతి కప్పల్ని పెంచుకుంటోంది. గిగి విటాలే అనే 13 ఏళ్ల అమ్మాయి 2 గ్రీన్ కలర్ కప్పలను పెంచుకుంటోంది. అవంటే ఆమెకు ప్రాణం. 5 నెలలుగా వాటితో ఎంతో స్నేహంగా ఉండే గిగీకి అవి ఆమె ఇంటి పెరట్లో దొరికాయట. వర్షాకాలంలో వాళ్ల పెరట్లో గ్రీన్ కలర్‌లో ఉన్న రెండు చిన్ని కప్పలను చూసిందట. మొదట భయపడినా తర్వాత ప్రతిరోజూ వాటిని చూస్తూ ఇష్టాన్ని పెంచుకుంది. కరోనా సమయంలో ఖాళీ దొరికినప్పుడల్లా నేచర్ వీడియోలను బాగా చూసేది గిగీ. వాటిలో పక్షులు, ప్రాణుల గురించి తెలుసుకుంది. అవి కూడా మన లాంటి జీవులే అని గ్రహించింది. అలా పుట్టిన ఇష్టాన్నే ఈ కప్పలపై చూపిస్తోంది.
కప్పలపై చాలా లోతైన రీసెర్చ్ చేసింది గిగీ…ఆ తర్వాత వాటిని ఇంట్లోకి తెచ్చి పెంచుకుంటుంది. వాటికి రకరకాల ఆహారం పెడుతోంది. వాటిని ఎప్పుడు చూసినా నవ్వుతున్నట్లు ఉంటాయనీ… వాటి ఆకారం కూడా నవ్వు తెప్పిస్తూ ఉంటుందని గిగీ చెబుతోంది. ఇంకో ఆసక్తికర విషయం చెప్పింది గిగీ.. మనం ఎలాగైతే కంటిన్యూగా ఇంట్లో ఉంటే బోర్ ఫీలవుతామో… అలాగే కప్పలు కూడా బోర్ ఫీల్ అవుతాయట. అందువల్ల వాటిని తరచూ బయటకు తీసుకెళ్తే… హాయిగా ఫీలవుతాయని అంటోంది. ప్రస్తుతం గిగీ తను ఎక్కడికి వెళ్లినా వాటిని వెంట తీసుకెళ్తోంది. ఇంట్లో కూడా తన పక్కనే వాటిని ఉంచుకుంటోంది. వాటి కోసం చిన్న చిన్న గిన్నెల లాంటి ఏర్పాట్లు కూడా చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ కప్పలతో చాలా వీడియోలు చేసింది గిగీ. రెండు కప్పల్లో ‘మూ’ తరచూ బయటకు వెళ్లేందుకు రెడీగా ఉంటుందనీ… మోచీ మాత్రం ఇంట్లోనే ఎక్కువగా తిరుగుతుందని అంటోంది. గిగీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 46వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. వారంతా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రాణికోటిపై దయాగుణం కలిగివుండటం మంచిదే అంటున్నారు.
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

