Divorce Celebrates: అగ్నిసాక్షిగా విడాకులు.. విడాకులను పండగలా సెలబ్రేట్ చేసుకున్న మహిళ.
'స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్' అన్నాడో సినీకవి. ఇక్కడ విడాకులు కూడా పెళ్లిలాంటిదే అంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీమెంబర్స్ మధ్యన తన విడాకులను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
‘స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్’ అన్నాడో సినీకవి. ఇక్కడ విడాకులు కూడా పెళ్లిలాంటిదే అంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీమెంబర్స్ మధ్యన తన విడాకులను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. వివాహ బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. విడాకుల కారణంగా పురుషుల కన్నా మహిళలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొందరైతే ఒంటరి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోలేక జీవితాన్నే అంతం చేసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించిందియూఎస్‌లోని లారెన్ బ్రూక్ అనే మహిళ 2012లో పెళ్లి చేసుకుంది. సరిగ్గా 2022లో విడాకులు కావాలంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో తాను ఒంటరిగా ఎలా జీవించాలంటూ ఎన్నో కన్నీటి రాత్రులను గడిపింది. జనవరి 2023న కోర్టు అధికారికంగా బ్రూక్ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో బ్రూక్ ఓ నిర్ణయానికి వచ్చింది. తనలోని బాధను ఆరోజుతో అంతం చేయాలనుకుంది. కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అందుకు నాందిగా తాను విడాకులు తీసుకోవాడాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. తన తల్లి ఫెలిసియా బౌమన్, తన బెస్ట్‌ఫ్రెండ్ సమక్షంలో తన విడాకులను వేడుకగా చేసుకుంది. ఆ వేడుకను ఆమె తల్లి, స్నేహితురాలు ఫోటోషూట్ చేశారు. తాను శక్తిమంతమైన మహిళగా తయారయ్యిందేకు ఇది నాంది అని చెప్పడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశ్యం అంటోంది బ్రూక్. నీతో నువ్వు పోరాడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొనే గొప్ప మహిళ తానేనని ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలని చెప్పేందుకే ఇలా చేశానంటోంది. ఇది కామెడీ కాదు.. “మనల్ని వద్దు అనుకున్న వాళ్లు సిగ్గుపడి తలదించుకునేలా తలెత్తి బతకాలి. బంధం కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ముందుకు సాగాలి” అంటూ భావోద్వేగంగా చెప్పింది. ఈ మేరకు తన పెళ్లి నాటి దుస్తులు, ఫోటోలు వాటి తాలుకా జ్ఞాపకాలను కాల్చేసి.. వేడుకలా సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!