Viral Video: భార్యకు భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యం.. చివరికి రూ.1.5 కోట్లు..!

|

Jun 30, 2023 | 8:42 PM

కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా సంతానం పొందే ప్రయత్నంలో భాగంగా భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యాన్ని ఉపయోగించారు. దీంతో సదరు దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా సంతానం పొందే ప్రయత్నంలో భాగంగా భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యాన్ని ఉపయోగించారు. దీంతో సదరు దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయపోరాటం చేపట్టారు. ఫలితంగా ఆ ఆస్పత్రి బాధితులకు కోటిన్నర పరిహారం చెల్లించుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతానభాగ్యం పొందేందుకు సదరు ఆసుపత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో వారికి కవలలు జన్మించారు. ఆ తరువాత శిశువులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా వారి తండ్రి మరొకరని తేలింది. దీంతో, ఆసుపత్రి వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటం ప్రారంభించారు. తమకు సదరు ఆసుపత్రి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కొన్నేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసుపై తాజాగా వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. బాధిత దంపతులకు కోటిన్నర పరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎన్‌సీడీఆర్‌సీ (NCDRC) ఆదేశించింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..