Viral: రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?

|

Nov 07, 2024 | 4:57 PM

ఓ మహిళ రైలులో ప్రయాణిస్తూ కిందనున్న కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ చివరికి ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ ఖాదర్‌వలి భార్య, పిల్లలతో కలిసి నిజాంపట్నంలో ఉంటున్నారు. ఆయన భార్య జిన్నతున్నీసా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి రాత్రి విజయవాడ ట్రైన్‌లో బయలుదేరింది.

రాత్రి 11 గంటల సమయంలో రైలు విజయవాడ పూల మార్కెట్ పరిసరాలకు చేరుకుంది. అక్కడామె రైలు నుంచి కిందనున్న బందరు కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చేరుకుంది. అక్కడ కాల్వ ఒడ్డున ఉన్న చెట్లలో పడటంతో ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. మహిళ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.