Viral Video: రాజ్ భవన్ సాక్షిగా దారుణం.. చీరలు అడ్డుపెట్టి నడిరోడ్డుపై మహిళకు ప్రసవం..

|

Aug 17, 2023 | 8:45 AM

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయం కలచివేసే ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేక.. ఓ నిండు గర్బిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఈ సంఘటన యూపీ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ ఎదురుగానే జరగడం గమనార్హం. రూపా సోని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు చీర అడ్డుగా పెట్టి ఆమెకు ప్రసవం చేయగా.. ఆమెకు మృతశిశువు జన్మించింది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయం కలచివేసే ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేక.. ఓ నిండు గర్బిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఈ సంఘటన యూపీ గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ ఎదురుగానే జరగడం గమనార్హం. రూపా సోని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు చీర అడ్డుగా పెట్టి ఆమెకు ప్రసవం చేయగా.. ఆమెకు మృతశిశువు జన్మించింది. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. నిండు గర్బిణి అయిన రూపా సోని నెలల నిండకుండానే నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఇంజెక్షన్ చేసి పంపేశారు. కానీ, ఉపశమనం లభించకపోవడంతో మరోసారి రిక్షాలో ఆస్పత్రికి వెళ్తుండగా.. పురిటి నొప్పులు అధికమయ్యాయి. ఆమె వేదనను గమనించి స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ, అది సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఆమె నడిరోడ్డుపైనే చనిపోయిన శిశువును ప్రసవించింది. ఈ దారుణ ఘటన రాజ్‌భవన్‌ ఎదురుగానే జరిగింది. దీంతో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల దారుణం జరిగిందంటూ అధికార విపక్షాల మధ్య విమర్శలు ఎక్కువయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...