Viral Video: పిల్లల కోసం ఆసుపత్రికి వెళితే.. వైద్యం వికటించి మహిళ మృతి.
పిల్లల కోసం సాఫల్య చికిత్సను అశ్రయించిన మహిళ చికిత్స వికటించి మృతి చెందింది. కర్నూలు జిల్లా జొహరాపురం గ్రామానికి చెందిన మోదీన్‌బీ కి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీసీ ప్యాపిలికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వన్నూరుస్వామితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్లైనా సంతానం కలగకపోవడంతో అనంతపురంలోని ఓ ఆసుపత్రి గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం
పిల్లల కోసం సాఫల్య చికిత్సను అశ్రయించిన మహిళ చికిత్స వికటించి మృతి చెందింది. కర్నూలు జిల్లా జొహరాపురం గ్రామానికి చెందిన మోదీన్‌బీ కి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీసీ ప్యాపిలికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వన్నూరుస్వామితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్లైనా సంతానం కలగకపోవడంతో అనంతపురంలోని ఓ ఆసుపత్రి గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మబలికింది. దీంతో మూడు నెలలుగా చికిత్స పొందుతున్నారు. సర్జరీ కోసమని మోదీన్‌బీని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. మందు ఇవ్వగానే నిమిషాల వ్యవధిలోనే వికటించి మృతి చెందింది. మృతురాలు గుత్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో పెద్దఎత్తున బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఆసుపత్రిలోని ఐసీయూ గదిని ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. అక్కడే ఉన్న అనస్థీషియా వైద్యుడిపై దాడికి ప్రయత్నించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...