ఈరోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంతో ముఖ్యమైపోయింది. ఎప్పుడు, ఎవరు, ఎలా మనపై దాడి చేస్తారో తేలియదు. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అనుకోని సంఘటనల నుంచి తప్పించుకునేందుకు వీలవుతుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. రెస్టారెంట్లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి టేబుల్ పైన వెయిటర్ ఏవో పెడుతోంది. ఇంతలో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు అకస్మాత్తుగా లేచి ఆమె చేయిని పట్టుకున్నాడు. ఆమె అతని చేయిని వెనక్కి విదిలించింది. అయినా అతను మళ్లీ ఆమె చేయి పట్టుకోవడంతో వెంటనే అతని మోహంపై దెబ్బలు వేసింది. ఆ తర్వాత కాలుతో తన్నింది. ఇంతలో రెండో వ్యక్తి కూడా ఆమెను కొట్టేందుకు రావడంతో అతడ్ని కూడా కాలితో తన్నింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారికి చుక్కలు చూపించింది. తనను తాను కాపాడుకుంది. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఆడ బ్రూస్ లీ' అంటే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతి ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తగిన బుద్ధి చెప్పిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..