Rat Viral Video: హారతి సమయంలో.. ఆలయంలో భజన చేస్తున్న ఎలుక.. వీడియో వైరల్.
భారతదేశం ఆధాత్మికతకు నిలయం. భారతీయులు ఎన్నో రూపాలలో దైవాన్ని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. చెట్లు చేమలను ప్రకృతిమాతగా, నదీ ప్రవాహాలను గంగమ్మతల్లిగా ఇలా పంచభూతాలను ఆరాధిస్తారు. కేవలం మానవులే కాదు భారతావనిలోని ప్రతి జీవిలోనూ ఆధ్యాత్మికత, దైవ భక్తి నిండి ఉంటుంది.
ఈ వీడియోలో ఒక ఎలుక ఆలయం వెలుపల నిలబడి ఉంది. ఆ సమయంలో ఆలయంలో హారతి జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎలుక ఎంతో భక్తితో రెండు కాళ్లపైన నిలబడి తన ముందుకాళ్లతో చప్పట్లు కొడుతూ భజన చేస్తూ భగవంతుడి పట్ల తన భక్తిని చాటుకుంది. మహారాష్ట్రలోని ఓ ఆలయంలో హారతి సమయంలో ఈ ఎలుక ప్రతిరోజూ చప్పట్లు కొడుతూ కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఈ అద్భుత ఘటనను తన సెల్ ఫోన్ లోని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 2 లక్షలమందికి పైగా వీక్షించారు. 25 వేలమందికి పైగా లైక్ చేశారు. తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఓ యూజర్ స్పందిస్తూ నేను ఆలయాల్లో జంతువులు భగవంతుని మొక్కడం చూశానని, ఇది నిజంగా అద్భుతం అంటూ పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...