Viral: కోనసీమలో వింత ఘటన.. ఆ చెట్టుకు తొమ్మిది తలలు.! వీడియో..
సాధారణంగా కొబ్బరి చెట్టుకి ఒకే తల ఉంటుంది. నిటారుగా ఎత్తుగా పెరిగే ఈ కొబ్బరిచెట్టుకు గెలలు గెలలుగా కాయలు కాస్తాయి. అయితే కోనసీమ జిల్లాలో ఓ కొబ్బరి చెట్టుకు ఏకంగా తొమ్మిది తలలు ఉన్నాయి. ఇదేంటి కొబ్బరిచెట్టుకు తొమ్మిది తలలు అనుకుంటున్నారా? అవును, కాజులూరు మండలం కోలంక గ్రామం లో ఓ కొబ్బరి చెట్టు ఏకంగా తొమ్మిది తలలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ కొబ్బరి చెట్టును అందరూ వింతగా చూస్తున్నారు. ఇది చాలా అరుదైన ఘటనగా చర్చించుకుంటున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామానికి చెందిన దంతులూరి నానాజీ మాస్టార్ కుటుంబ సభ్యులకు కోలంకలో వ్యయసాయ క్షేత్రం ఉంది. అక్కడ గట్టుపై చాలాకాలం క్రితం ఓ కొబ్బరి చెట్టు ను నాటారు. కొబ్బరి చెట్టు పెరిగిన కొద్దీ ఒక తల తర్వాత ఒక తల వేస్తూ ఇప్పటికి తొమ్మిది తలలుతో కొబ్బరి చెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొమ్మిది తలలు తొంబై కాయలు కాస్తూ ఈ కొబ్బరి చెట్టు అధికంగా కొబ్బరి దిగుబడి నిస్తోంది. ఈ చెట్టును చూసేందుకు చుట్టుపక్కలవారు అక్కడికి చేరుతున్నారు. అంతేకాకుండా ఈ తొమ్మిది తలల కొబ్బరి చెట్టును గ్రామస్తులు నవ దుర్గమాతగా భావించి పూజలు చేస్తున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. పలువురు సందర్శకులు ఈ కొబ్బరిచెట్టుతో సెల్ఫీలు ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.