Secreat locker: కొత్త ఇంటిని శుభ్రం చేస్తుండగా కనిపించిన సీక్రెట్‌ లాకర్‌ ఓపెన్‌ చేసి చూసిన వ్యక్త్తులకు షాక్‌..

Updated on: Sep 03, 2022 | 9:53 PM

ఓ ప్రేమ జంట కలిసి జీవించాలనుకున్నారు. వేలంలో తక్కువ ధరకు వచ్చిన ఓ ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యే క్రమంలో దాన్ని శుభ్రం చేస్తుండగా.. వారికి ఓ రహస్య లాకర్ కనిపించింది.


ఓ ప్రేమ జంట కలిసి జీవించాలనుకున్నారు. వేలంలో తక్కువ ధరకు వచ్చిన ఓ ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యే క్రమంలో దాన్ని శుభ్రం చేస్తుండగా.. వారికి ఓ రహస్య లాకర్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ అందులో ఏముందంటే.!

అమెరికాకు చెందిన టిఫనీ, మ్యాట్ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌‌లో ఉండాలనుకున్నారు. అందులో భాగంగానే వేలంలో తక్కువ ధరకు వచ్చిన ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అనంతరం కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యే క్రమంలో దాన్ని శుభ్రం ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా.. ఓ రహస్య లాకర్ కనిపించింది. అందులో ఏవైనా విలువైన వస్తువులు లేదా డబ్బులు ఉండొచ్చునేమోనని కష్టపడి ఆ లాకర్‌ను తెరిచారు. తీరా చూస్తే అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి.. మహిళతో అభ్యంతకర స్థితిలో ఉన్న ఫోటోలు, ఇన్సూరెన్స్ పేపర్స్, రెండో ప్రపంచ యుద్ధం నాటి కత్తి, బుల్లెట్స్ ఉన్నాయి. వాటిని చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. వాటిని ఖాకీలు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 03, 2022 09:53 PM