Blue Moon: వినీలాకాశంలో అరుదైన దృశ్యం.. మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే..!
ఖగోళ విశ్వంలో ఎన్నో వింత కనువిందు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్ట్యూన్ , శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.
ఖగోళ విశ్వంలో ఎన్నో వింత కనువిందు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్ట్యూన్ , శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే మరో అరుదైన దృశ్యం బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతుంది. ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. రెండోవది ఆగస్టు 30 బుధవారం బ్లూబూన్ ఏర్పడబోతుంది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి.. కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం అధికంగా వెన్నెలను పంచబోతున్నాడు. అయితే, చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్‌లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతుంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని తిలకించాలంటే.. మళ్లీ తొమ్మిదేళ్ళు ఆగాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..