Monkey Viral video: కోతి చేష్టలు అని తీసిపారేయకండి..! కోతి బావ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ నెటిజన్లకు వినోదం పంచుతాయి. అంతేకాదు కొన్ని వీడియోలు చూస్తే నెటిజన్లు ఆలోచనలో పడతారు కూడా.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ నెటిజన్లకు వినోదం పంచుతాయి. అంతేకాదు కొన్ని వీడియోలు చూస్తే నెటిజన్లు ఆలోచనలో పడతారు కూడా. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఒక కోతికి సంబంధించిన వీడియో.. మరి ఆ కోతి మనకేం నేర్పిస్తుందో చూద్దాం..వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి మంచి ప్రొఫెషనల్ వాషర్‌మెన్‌లా బట్టలు ఉతుకుతుంది. బట్టలకు అంటిన మురికిని తొలగించడానికి.. వాటిని బాది బాది మరీ ఉతికింది. అంతేకాదు టబ్‌లోని నీటిలో చక్కగా జాడించి, మళ్లీ ఉతికింది. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి బట్టలు ఉతికే తీరు చూసి ఫిదా అయిపోయారు. ఈ వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ కోతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Sep 07, 2022 09:20 AM
