Viral Video: పులి బోనులో ఎరగా కోడి.. చోరీకి యత్నించిన వ్యక్తి..చివరికి..

|

Mar 09, 2023 | 8:37 AM

నాన్‌వెజ్‌ ప్రియులు కోడి కనిపించిందంటే చాలు లొట్టలేస్తుంటారు. వెంటనే చికెన్‌ బిర్యానీనో, చికెన్‌ 65వో ఏదోకటి లాగించాలనుకుంటారు. అయితే కొందరికి విచిత్రమైన అలవాటు ఉంటుంది..

పులిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులోకి ఒక వ్యక్తి వెళ్లాడు. పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని చోరీ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే డోర్‌ మూసుకుపోవడంతో ఆ వ్యక్తి పులి బోనులో చిక్కుకుపోయాడు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో జరిగింది. ఆ జిల్లా పరిధిలోని బసెందువా గ్రామంలో ఒక చిరుత పులి సంచరిస్తుంది. భయాందోళన చెందిన గ్రామస్తులు దాని గురించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిరుత జాడను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ఆ గ్రామంలో ఒక బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం ఆ బోనులో ఒక కోడిని ఉంచారు. కాగా, పులి బోనులో ఉన్న కోడిపై ఒక వ్యక్తి కన్ను పడింది. ఆ కోడిని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినాలని అతడు భావించాడు. గుట్టుగా ఆ బోనులోకి ప్రవేశించాడు. లోపలున్న కోడిని పట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆ పులి బోను మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోను లోపల చిక్కుకున్నాడు. నన్ను రక్షించండి బాబోయ్‌ అంటూ బావురుమన్నాడు. ఫిబ్రవరి 24న ఉదయం గ్రామస్తులు వచ్చి చూసేసరికి బోనులో పులికి బదులు ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. విషయం వారికి అర్థమైంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బోను ముందున్న ఇనుప ఊచల డోర్‌ను ఓపెన్‌ ఆ వ్యక్తిని బయటకు రప్పించారు. కాగా, స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 09, 2023 08:37 AM